శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 747 పాయింట్లు పెరిగి 82,189 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 252 పాయింట్లు వృద్ధిచెంది 25,003 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 818 పాయింట్లు పెరిగి 56,578 వద్దకు చేరింది.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,009.71 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 9,342.48 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 70 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 24,800 లెవల్స్ వద్ద 20 డే ఎస్ఎంఏ ఉంది. దీని పైన ఉన్నంత కాలం సూచీ పాజిటివ్‌గా ఉన్నట్టు అర్థం. 25,100 లెవల్స్ వద్ద రెసిస్టెన్స్ ఉంది. అది దాటితే సూచీ 25,400- 25,500 వరకు వెళ్లొచ్చు. కానీ 24,800 కన్నా కిందకు పడితే.. నిఫ్టీ50 24,500 వరకు వెళ్లొచ్చు,” అని కొటక్ సెక్యూరిటీస్ వీపీ- టెక్నికల్ రీసెర్చ్ అమోల్ అథవాలే తెలిపారు.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 1.05 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 1.03శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.20 శాతం పెరిగింది.
యూఎస్ జాబ్స్ డేటా అనుకున్న దాని కన్నా మెరుగ్గా రావడం ఈ లాభాలకు కారణం.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఇన్ఫోసిస్- బై రూ. 1568, స్టాప్ లాస్ రూ. 1515, టార్గెట్ రూ. 1660
ఐసీఐసీఐ బ్యాంక్- బై రూ. 1460, స్టాప్ లాస్ రూ. 1400, టార్గెట్ రూ. 1575
సీఈఎస్సీ- బై రూ. 168, స్టాప్ లాస్ రూ. 160, టార్గెట్ రూ. 183
బజాజ్ ఫిన్సర్వ్- బై రూ. 1992, స్టాప్ లాస్ రూ. 1950, టార్గెట్ రూ. 2100
బీహెచ్ఈఎల్- బై రూ. 255, స్టాప్ లాస్ రూ. 250, టార్గెట్ రూ. 267
గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్: రూ.351.25 వద్ద కొనండి, టార్గెట్ రూ.385, స్టాప్ లాస్ రూ.334;
గోద్రెజ్ ప్రాపర్టీస్: రూ.2467 వద్ద కొనండి, టార్గెట్ రూ.2720, స్టాప్ లాస్ రూ.2340;
ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్: రూ .2355.80 వద్ద కొనండి, టార్గెట్ రూ .2600, స్టాప్ లాస్ రూ .2240;
గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్: రూ.401.05 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.440, స్టాప్ లాస్ రూ.380;
యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ: రూ .1223.90 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ .1360, స్టాప్ లాస్ రూ .1160.
సంబంధిత కథనం