Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​! ఈ 5 బ్రేకౌట్​ స్టాక్స్​తో లాభాలకు ఛాన్స్​!-stocks to buy today 9th december 2024 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ అలర్ట్​! ఈ 5 బ్రేకౌట్​ స్టాక్స్​తో లాభాలకు ఛాన్స్​!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​! ఈ 5 బ్రేకౌట్​ స్టాక్స్​తో లాభాలకు ఛాన్స్​!

Sharath Chitturi HT Telugu
Dec 09, 2024 08:10 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్​ స్టాక్స్​ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

స్టాక్స్​ టు బై టుడే..
స్టాక్స్​ టు బై టుడే..

దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 57 పాయింట్లు పడి 81,709 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 31 పాయింట్లు కోల్పోయి 24,678 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 94 పాయింట్లు పడి 53,509 వద్దకు చేరింది.

yearly horoscope entry point

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ షార్ట్​ టర్మ్​ ట్రెండ్​.. పాజిటివ్​గా ఉంది. 24,000- 24,100 దగ్గర స్టెబులిటీ ఉంటే.. నిఫ్టీ 24,380- 24,400 వరకు వెళ్లొచ్చు. 23,800 లెవల్స్​ వద్ద నిఫ్టీకి బలమైన సపోర్ట్​ ఉంది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1830.31 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1659.06 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

డిసెంబర్​​ నెల​లో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు రూ. 11,933.59 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1792.47 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 50 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.28శాతం పడింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.25శాతం పెరిగింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.81శాతం వృద్ధిని నమోదు చేసింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

అజ్మీర రియాల్టీ అండ్​ ఇన్​ఫ్రా- బై రూ. 1136.5, స్టాప్​ లాస్​ రూ. 1095, టార్గెట్​ రూ. 1200

దీపక్​ ఫర్టిలైజర్​- బై రూ. 1423.85, స్టాప్​ లాస్​ రూ. 1370, టార్గెట్​ రూ. 1515

భారత్​ డైనమిక్స్​- బై రూ. 1220, స్టాప్​ లాస్​ రూ. 1180, టార్గెట్​ రూ. 1265

జ్యోతీ సీఎన్​సీ ఆటోమేషన్​- బై రూ. 1340, స్టాప్​ లాస్​ రూ. 1300, టార్గెట్​ రూ. 1385

గెయిల్​ ఇండియా- బై రూ. 210, స్టాప్​ లాస్​ రూ. 200, టార్గెట్​ రూ. 224

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

టైమ్ టెక్నోప్లాస్ట్: రూ.480.45 వద్ద కొనండి, టార్గెట్ రూ.515, స్టాప్ లాస్ రూ.465;

బోరోసిల్ రెన్యూవబుల్స్: రూ.554.55 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ.580, స్టాప్ లాస్ రూ.535;

ఈఎంఎస్: రూ.894 వద్ద కొనండి, టార్గెట్ రూ.955, స్టాప్ లాస్ రూ.860;

జేకే పేపర్: రూ.483 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.515, స్టాప్ లాస్ రూ.465; మరియు

పీజీ ఎలక్ట్రోప్లాస్ట్: రూ .813 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ .870, స్టాప్ లాస్ రూ .785.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం