Stocks to buy today : ఈ రూ. 198 స్టాక్​కి టైమ్​ వచ్చింది- షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు!-stocks to buy today 9th august 2024 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ఈ రూ. 198 స్టాక్​కి టైమ్​ వచ్చింది- షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు!

Stocks to buy today : ఈ రూ. 198 స్టాక్​కి టైమ్​ వచ్చింది- షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు!

Sharath Chitturi HT Telugu
Aug 09, 2024 08:50 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఇందులో రూ. 198 స్టాక్​ సైతం ఉంది. ఆ వివరాలు..

స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..
స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాలతో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 582 పాయింట్లు పడి 78,886 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 181 పాయింట్లు కోల్పోయి 24,117 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ మాత్రం 38 పాయింట్లు పెరిగి 50,157 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2626.73 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 577.3 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఎఫ్​ఐఐలు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 20767.2 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. డీఐఐలు రూ. 19520.42 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ లాభాలతో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 235 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

ఇదీ చూడండి:- RBI Repo Rate: ఆర్బీఐ రెపో రేటు యథాతథం.. ద్రవ్యోల్బణం, జీడీపీ వృద్ధి రేటు అంచనాలు ఇవే

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు భారీగా లాభపడ్డాయి. డౌ జోన్స్​ 1.75శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 2.3శాతం వృద్ధిచెందింది. నాస్​డాక్​ 2.8శాతం మేర లాభాలను చూసింది.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు పెరగడంతో ఆసియా మార్కెట్​లు సైతం లాభాల్లో ట్రేడ్​ అవుతున్నాయి.

ఓలా ఎలక్ట్రిక్​ ఐపీఓ లిస్టింగ్​..

మచ్​ అవైటెడ్​ ఓలా ఎలక్ట్రిక్​ ఐపీఓ లిస్టింగ్​ నేడు జరగనుంది. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఓలా షేర్లు సెన్సెక్స్​, నిఫ్టీల్లో లిస్ట్​ అవ్వనున్నాయి. కాగా గ్రే మార్కెట్​ ప్రీమియం ప్రకారం.. ఓలా షేర్లు అప్పర్​ బ్యాండ్​ ప్రైజ్​ రూ. 76 కన్నా రూ.3 డిస్కౌంట్​లో ఓపెన్​ అవుతాయి. లిస్టింగ్​ సమయంలో ఓలా ఐపీఓ అలాట్​ అయ్యిన మదుపర్లకు నష్టాలు తప్పవని జీఎంపీ సూచిస్తోంది.

స్టాక్స్​ టు బై..

సెంచురీ ప్లైబోర్డులు: రూ.722.7, టార్గెట్ రూ.775, స్టాప్ లాస్ రూ.697.

మణప్పురం ఫైనాన్స్: రూ.198, టార్గెట్ రూ.205, స్టాప్ లాస్ రూ.194

ఇండస్ఇండ్ బ్యాంక్: రూ.1,348 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1,380, స్టాప్ లాస్ రూ.1,320

హిందుస్థాన్ యూనిలీవర్: రూ.2,735 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ.2,800, స్టాప్ లాస్ రూ.2,700

హెచ్​డీఎఫ్​సీ లైఫ్ ఇన్సూరెన్స్: రూ.710.35, టార్గెట్ రూ.762, స్టాప్ లాస్ రూ.684.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

సంబంధిత కథనం