Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్.. ఈ రూ. 225 స్టాక్‌తో షార్ట్ టర్మ్‌లో భారీ లాభాలు!
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 36 పాయింట్లు పడి 79,960 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 3 పాయింట్లు కోల్పోయి 24,320 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 235 పాయింట్లు నష్టపోయి 52,425 వద్దకు చేరింది.
నిఫ్టీ షార్ట్ టర్మ్ ట్రెండ్ సానుకూలంగా కొనసాగుతోందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు. వచ్చే 1 లేదా 2 సెషన్ల పాటు ఇదే రేంజ్లో కదలికను కొనసాగించే అవకాశం ఉందన్నారు. తరువాత 24,400 కంటే ఎక్కువ కదలికను చూడవచ్చని, కీలక రెసిస్టెన్స్ అయిన 24,400ను అధిగమిస్తే, మార్కెట్లో మరింత అప్‌ట్రెండ్ కొనసాగవచ్చని స్పష్టం చేశారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 60.98 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2866.79 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
ఎఫ్ఐఐలు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 6935.64 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. డీఐఐలు రూ. 2481.5 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 5 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
ఇదీ చూడండి:- RVNL Shares : ఈ రైల్వే షేర్లు పాత రికార్డులు బద్దలు కొట్టాయి.. దీనికి గల కారణాలు తెలుసుకోండి
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. డౌ జోన్స్ 0.08శాతం పడింది. ఎస్ అండ్ పీ 500 0.10శాతం, నాస్డాక్ 0.28శాతం మేర పెరిగాయి. ఈ రెండు సూచీలు గత ఐదు ట్రేడింగ్ సెషన్స్‌లో నూతన గరిష్ఠాలను తాకుతూనే ఉన్నాయి.
స్టాక్స్ టు బై..
నేషనల్ అల్యూమినియం కంపెనీ (నాల్కో): రూ.206.30 వద్ద కొనండి, టార్గెట్ రూ.222, స్టాప్ లాస్ రూ.198.
జువారీ ఇండస్ట్రీస్: రూ.413 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.435, స్టాప్ లాస్ రూ.399.
బజాజ్ ఆటో: రూ.9530 వద్ద కొనండి, టార్గెట్ రూ.9800, స్టాప్ లాస్ రూ.9400.
అశోక్ లేలాండ్: రూ.226 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.235, స్టాప్ లాస్ రూ.222.
బ్యాంక్ ఆఫ్ బరోడా: రూ.262 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.272, స్టాప్ లాస్ రూ.255
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం