Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్- ఈ రూ. 210 స్టాక్‌పై భారీ అంచనాలు
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్‌ని నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 836 పాయింట్లు పడి 79,542 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 285 పాయింట్లు కోల్పోయి 24,199 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 401 పాయింట్లు పతనమై 51,916 వద్దకు చేరింది.
“24,500 దగ్గర నిఫ్టీ50కి బలమైన రెసిస్టెన్స్ ఉంది. 24,200 దగ్గర సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ జోన్ చాలా కీలకంగా వ్యవహరిస్తుంది,” అని ప్రభుదాస్ లిల్లాధేర్ వైస్ ప్రెసిడెంట్, టెక్నికల్ రీసెర్చ్, వైశాలి పరేఖ్ తెలిపారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 4888.77 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1786.7 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
నవంబర్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు రూ. 16,445.49 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 12,265.74 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 10 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ ఫ్లాట్‌గా ముగిసింది. ఎస్ అండ్ పీ 500 0.74శాతం పెరిగింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.51శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
కాప్లిన్ పాయింట్ ల్యాబ్- బై రూ. 2,121.7, స్టాప్ లాస్ రూ. 2045, టార్గెట్ రూ. 2250
కార్‌ట్రేడ్ టెక్- బై రూ. 1204.9, స్టాప్ లాస్ రూ. 1160, టార్గెట్ రూ. 1270
టీసీఎస్- బై రూ. 4,150, స్టాప్ లాస్ రూ. 4100, టార్గెట్ రూ. 4240
కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్- బై రూ. 298, స్టాప్ లాస్ రూ. 290, టార్గెట్ రూ. 315
గెయిల్- బై రూ. 210, స్టాప్ లాస్ రూ. 202, టార్గెట్ రూ. 220
ఐటీఐ లిమిటెడ్(ఐటీఐ): రూ.266.50కే కొనొచ్చు. రూ.300 టార్గెట్.. స్టాప్ లాస్ రూ.250.
కేఈసీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (కెఇసి): రూ .1,050.70 వద్ద కొనండి; రూ.1,150 టార్గెట్ స్టాప్ లాస్ రూ.970.
కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ (క్యామ్స్): రూ.4,662.50 వద్ద కొనండి. రూ.5,000 టార్గెట్ స్టాప్ లాస్ రూ.4,550.
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం