Stocks to buy today : మార్కెట్లో రక్తపాతం- కానీ ఈ 5 బ్రేకౌట్ స్టాక్స్‌తో లాభాలు..!
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్ స్టాక్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1258 పాయింట్లు పడి 77,965 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 389 పాయింట్లు కోల్పోయి 23,616 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 1067 పాయింట్లు పడి 49,922 వద్దకు చేరింది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ50కి 23,300 లెవల్స్ వద్ద అత్యంత కీలకమైన సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అయితే మాత్రం మార్కెట్లో మరింత ప్యానిక్ సెల్లింగ్ నెలకొనే అవకాశం ఉంది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2575.06 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5749.65 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
జనవరి నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు రూ. 7078.27కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 8282.76 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 55 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.06శాతం పడింది. ఎస్ అండ్ పీ 500 0.55శాతం పెరిగింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.24శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ లిమిటెడ్ (పీజీఈఎల్): బై రూ.996.4 . రూ.1,075 టార్గెట్, స్టాప్ లాస్ రూ 965.
షైలీ ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ లిమిటెడ్ (షాలీ) : రూ.1,474.9 వద్ద కొనండి. టార్గెట్ రూ.1,550, స్టాప్ లాస్ రూ.1,400
సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (సీడీఎస్ఎల్): బై రూ.1,725. టార్గెట్ రూ.1,760, స్టాప్ లాస్ రూ.1,700
ఆర్బీఎల్ బ్యాంక్ లిమిటెడ్ : రూ .167 వద్ద కొనండి; రూ.174 టార్గెట్. రూ.163 వద్ద స్టాప్ లాస్.
కాంకార్డ్ బయోటెక్ లిమిటెడ్ : రూ.2,143కు కొనుగోలు. రూ.2,200 టార్గెట్. రూ.2,100 వద్ద స్టాప్ లాస్.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
పీఎన్జీఎస్ గార్గి ఫ్యాషన్ జ్యువెలరీ: రూ.1372.20 వద్ద కొనండి, టార్గెట్ రూ.1470, స్టాప్ లాస్ రూ.1320;
పీటీసీ ఇండస్ట్రీస్: రూ.15,500కు కొనుగోలు, టార్గెట్ రూ.17,000, స్టాప్ లాస్ రూ.15,000;
జేటీఎల్ ఇండస్ట్రీస్: రూ.104.25 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.111, స్టాప్ లాస్ రూ.100;
ఎన్డీఆర్ ఆటో కాంపోనెంట్స్: రూ.795 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.850, స్టాప్ లాస్ రూ.770;
విజయ డయాగ్నోస్టిక్ సెంటర్: రూ.1126.30 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1212, స్టాప్ లాస్ రూ.1085.
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం
టాపిక్