Stocks to buy today : ఈ రూ. 190 స్టాక్‌తో షార్ట్ టర్మ్‌లో భారీ లాభాలు..!
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్‌ని లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 692 పాయింట్ల లాభంతో 75,074 వద్ద స్థిరపడింది. నిఫ్టీ.. 201 పాయింట్లు పెరిగి 22,821 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ.. 237 పాయింట్ల లాభంతో 49,291 వద్ద ఓపెన్ అయ్యింది.
లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో ఇంకా ఒడుదొడుకులు కనిపిస్తున్నాయి. మదుపర్లు ఆచితూచి వ్యవహరించాలని స్టాక్ మార్కెట్ నిపుణులు సూచించారు. బిగినర్లు.. ట్రేడింగ్‌కి కాస్త దూరంగా ఉండటం శ్రేయస్కరం అని అంటున్నారు.
నిఫ్టీకి 22,640 లెవల్స్ సపోర్ట్‌గా ఉది. 23,200 దగ్గర రెసిస్టెన్స్ ఉంది.
ఆర్బీఐ మొనేటరీ పాలసీ వివరాలు నేడు వెలువడనున్నాయి. ఈసారి కూడా రేట్ కట్స్ ఉండవని మార్కెట్ భావిస్తోంది. ఇదే జరిగితే.. వడ్డీ రేట్లు వరుసగా 8వ సారి యథాతథంగా ఉంటున్నట్టు. ఒకవేళ వడ్డీ రేట్లను కట్ చేస్తే మాత్రం.. అది స్టాక్ మార్కెట్లలో అనూహ్య పరిణామం అవుతుంది. కానీ ఇది దాదాపు జరగకపోవచ్చు. ఉదయం 10 గంటలకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియా సమావేశం ద్వారా వడ్డీ రేట్లపై కీలక ప్రకటన చేస్తారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
Stock market news today : గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 6867.72 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు సైతం రూ. 3718.38 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని ఫ్లాట్‌గా మొదలుపెట్టే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ 20 పాయింట్ల డౌన్లో ఉండటం ఇందుకు కారణం.
ఇదీ చూడండి:- Nvidia surpasses Apple: మార్కెట్ క్యాప్ లో ఆపిల్ ను అధిగమించిన ఎన్ విడియా; తొలి స్థానంలోనే మైక్రోసాఫ్ట్
అమెరికా స్టాక్ మార్కెట్లు..
US Stock market Updates : గురువారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. డౌ జోన్స్ 0.2శాతం లాభపడింది. ఎస్ అండ్ పీ 500 0.02శాతం, నాస్డాక్ 0.09శాతం నష్టపోయాయి.
స్టాక్స్ టు బై..
Stocks to buy : వీఏ టెక్ వాబాగ్:- బై రూ. 1078, స్టాప్ లాస్ రూ. 1035, టార్గెట్ రూ. 1150
ఇన్పోసిస్:- బై రూ. 1472.75, స్టాప్ లాస్ రూ. 1435, టార్గెట్ రూ. 1545
ఎస్బీఐ:- బై రూ. 818, స్టాప్ లాస్ రూ. 800, టార్గెట్ రూ. 850
బీహెచ్ఈఎల్:- బై రూ. 277, స్టాప్ లాస్ రూ. 265, టార్గెట్ రూ. 295
బంధన్ బ్యాంక్:- బై రూ. 191, స్టాప్ లాస్ రూ. 185, టార్గెట్ రూ. 200
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం