Stocks to buy today : మార్కెట్ ఎలా ఉన్నా.. ఈ రూ. 185 స్టాక్‌లో లాభాలకు ఛాన్స్!
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్ స్టాక్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 721 పాయింట్లు పడి 79,223 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 184 పాయింట్లు కోల్పోయి 24,005 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 617 పాయింట్లు పడి 50,989 వద్దకు చేరింది.
50, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్‌ల ఓట్లుక్పై స్టాక్ మార్కెట్ నిపుణుడు పరేఖ్ మాట్లాడుతూ.. "గత సెషన్లో బలమైన పుల్ బ్యాక్ తరువాత నిఫ్టీ ముఖ్యమైన 50 ఈఎంఏ జోన్ 24,200 స్థాయిల వద్ద రెసిస్టెన్స్‌ని చూసింది. ప్రాఫిట్ బుకింగ్ పక్షపాతంతో 24,000 జోన్ సమీపంలో ణుగిసింది. రాబోయే రోజుల్లో మార్కెట్లు పాజిటివ్‌గా ఉన్నప్పటికీ, కాస్త జాగ్రత్తగా ఉండాలి," అని అన్నారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 4227.25 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 820.6 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
జనవరి నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు రూ. 4503.21కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2533.11 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని స్వల్ప లభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 40 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.77శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 1.24శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.72శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
టైటాన్ కంపెనీ- రూ.3,451.65 వద్ద కొనండి. టార్గెట్ రూ.3,693; స్టాప్ లాస్ రూ.3,330.
ఔథమ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఏఐఐఎల్): 1,948.2 వద్ద కొనుగోలు చేయండి. టార్గెట్ రూ.2,080 స్టాప్ లాస్ రూ.1,880.
గెయిల్ ఇండియా లిమిటెడ్ (గెయిల్): రూ.191 వద్ద కొనండి. రూ.200 టార్గెట్. రూ.185 వద్ద స్టాప్ లాస్.
శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (శ్రీరామ్ఫిన్): రూ.3,040 వద్ద కొనండి. రూ.3,140 టార్గెట్. స్టాప్ లాస్ రూ.2,980.
ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ (ఏబీబీసీఎల్): రూ.185 వద్ద కొనండి. రూ.195 టార్గెట్. రూ.178 వద్ద స్టాప్ లాస్.
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం