Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్.. ఈ స్టాక్స్‌లో ఇప్పుడు ఎంట్రీ ఇస్తే భారీ లాభాలు!
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
Stocks to buy today : అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం భయాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం కూడా భారీ నష్టాలను చూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 2226 పాయింట్లు పడి 78,759 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 662 పాయింట్లు కోల్పోయి 24,055 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 1258 పాయింట్ల నష్టంతో 60,092 వద్దకు చేరింది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం, నిఫ్టీ50 సపోర్ట్ 23,900 - 23,700 వద్ద ఉంది. రెసిస్టెన్స్ 24,200 - 24,500 వద్ద కనిపిస్తోంది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 10073.75 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 9155.55 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఎఫ్ఐఐలు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 11294.47 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. డీఐఐలు రూ. 11784.46 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని భారీ లాభాలతో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 225 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లోనూ అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. డౌ జోన్స్ 2.60శాతం పడింది. ఎస్ అండ్ పీ 500 3శాతం పడింది. నాస్డాక్ 2.9శాతం మేర నష్టపోయింది.
జపాన్ స్టాక్ మార్కెట్లో రక్తపాతం..
అమెరికా ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే అధ్వాన్నంగా ఉండొచ్చన్న అంచనాల నేపథ్యంలో ప్రపంచ స్టాక్ మార్కెట్లు సోమవారం కుప్పకూలాయి. జపాన్ స్టాక్ మార్కెట్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆర్థిక మాంద్యం భయాలతో పాటు జపాన్ బ్యాంక్ వడ్డీలు పెంచడంతో సూచీలు సోమవారం కుప్పకూలాయి. నిక్కీ 225 షేరు సూచీ 12.4 శాతం పతనమైంది. అంటే ఒక్క రోజులో 4,451 పాయింట్లు కోల్పోయి 31,458కు పడిపోయింది. అంతేకాదు శుక్రవారం 5.8 శాతం క్షీణించిన నిక్కీ, గత రెండు ట్రేడింగ్ సెషన్లలో ఏకంగా 18.2 శాతం పతనమై మదుపర్లకు భారీ నష్టాలను తీసుకొచ్చింది. 1987 అక్టోబరులో "బ్లాక్ మండే" అనంతరం జపాన్ స్టాక్ మార్కెట్ సూచీ నిక్కీ ఒక్క రోజులో ఈ స్థాయిలో పడటం ఇదే తొలిసారి! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సోమవారం జపాన్ నిక్కీ భారీగా నష్టపోగా, మంగళవారం భారీ లాభాల్లో కొనసాగుతోంది.
స్టాక్స్ టు బై..
హిందుస్థాన్ యూనిలీవర్: రూ.2,720 వద్ద కొనుగోలు, రూ.2,780 టార్గెట్, స్టాప్ లాస్ రూ.2,680.
టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్: రూ.1,197 వద్ద కొనుగోలు, టార్గెట్ 1,230, స్టాప్ లాస్ రూ.1,180
హుతమాకి ఇండియా: రూ.425.65 వద్ద కొనుగోళ్లు, టార్గెట్ రూ.445, రూ.410 వద్ద స్టాప్ లాస్
డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్: రూ.3,160.15 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.3,310, స్టాప్ లాస్ రూ.3,040
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం