శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 224 పాయింట్లు పెరిగి 81,207 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 58 పాయింట్లు వృద్ధిచెంది 24,984 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 241 పాయింట్లు పెరిగి 55,589 వద్దకు చేరింది.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,583.37 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 489.76 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ సెప్టెంబర్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 3,188.57 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,405.9 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 45 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 24,750-25,100 రేంజ్లో కదలాడవచ్చు. 24,750 సపోర్ట్గాను, 25,100 లెవల్ రెసిస్టెన్స్గాను ఉండనుంది,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్ టెక్నికల్ ఎనలిస్ట్ వత్సల్ భువ తెలిపారు.
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.51 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.44శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.22 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఇండియన్ బ్యాంక్- బై రూ. 765.9, స్టాప్ లాస్ రూ. 740, టార్గెట్ రూ. 818
పూనవాలా ఫిన్‌కార్ప్- బై రూ. 524.4, స్టాప్ లాస్ రూ. 506, టార్గెట్ రూ. 562
టీవీఎస్ మోటార్ కంపెనీ- బై రూ. 3447, స్టాప్ లాస్ రూ. 3350, టార్గెట్ రూ. 3700
జేబీ కెమికల్స్ అండ్ ఫార్మా- బై రూ. 1668, స్టాప్ లాస్ రూ. 1640, టార్గెట్ రూ. 1750
పంజాబ్ నేషనల్ బ్యాంక్- బై రూ. 114, స్టాప్ లాస్ రూ. 109, టార్గెట్ రూ. 119
రెమ్సన్స్ ఇండస్ట్రీస్: రూ .128.9 వద్ద కొనండి, లక్ష్యం రూ .139, స్టాప్ లాస్ రూ .125;
మనోరమ ఇండస్ట్రీస్: రూ.1500 వద్ద కొనండి, టార్గెట్ రూ.1616, స్టాప్ లాస్ రూ.1444;
జోటా హెల్త్ కేర్: రూ.1520, టార్గెట్ రూ.1630, స్టాప్ లాస్ రూ.1460;
ఇండియా నిప్పన్ ఎలక్ట్రికల్స్: రూ.1046 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1120, స్టాప్ లాస్ రూ.1010;
ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్: రూ .205.93 వద్ద కొనండి, టార్గెట్ రూ .222, స్టాప్ లాస్ రూ .199.
సంబంధిత కథనం
టాపిక్