Stocks to buy today : ఈ రూ. 330 స్టాక్​పై ఫోకస్​ చేస్తే.. షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు!-stocks to buy today 5th march 2024 stock market sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Stocks To Buy Today 5th March 2024 Stock Market Sensex And Nifty News Latest

Stocks to buy today : ఈ రూ. 330 స్టాక్​పై ఫోకస్​ చేస్తే.. షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు!

Sharath Chitturi HT Telugu
Mar 05, 2024 08:42 AM IST

Stocks to buy today : స్టాక్​ మార్కెట్​ ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. పూర్తి లిస్ట్​ని ఇక్కడ చూడండి..

నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​..
నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​..

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని స్వల్ప లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 66 పాయింట్లు పెరిగి 73,872 వద్ద ముగిసింది. ఇక ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 27 పాయింట్ల లాభంతో 22,406 వద్ద స్థిరపడింది. 159 పాయింట్లు పెరిగిన బ్యాంక్​ నిఫ్టీ.. 47,456 వద్దకు చేరింది.

ట్రెండింగ్ వార్తలు

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ50 అప్​ట్రెండ్​లో ఉంది. కానీ ఇక్కడి నుంచి కింద పడితే.. మంచి బైయింగ్​ అవకాశాలు ఉంటాయి. 22,250- 22,200 లెవల్స్​ సపోర్ట్​గా ఉన్నాయి. షార్ట్​ టర్మ్​లో నిప్టీ50.. 22,600- 22,800 లెవల్స్​కి వెళ్లొచ్చు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 564.06 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3542.87 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

Stock market news today : ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా మొదలుపెట్టే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ.. దాదాపు 20 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగిశాయి. డౌజోన్స్​ 0.13శాతం, ఎస్​ అండ్​ పీ 500 0.12శాతం మేర నష్టపోయాయి. డౌ జోన్స్​ 0.41శాతం నష్టపోయింది.

స్టాక్స్​ టు బై..

Stocks to buy list : టీడీ పవర్​ సిస్టెమ్స్​:- బై రూ. 329, స్టాప్​ లాస్​ రూ. 323, టార్గెట్​ రూ. 351

గ్రఫైట్​ ఇండియా:- బై రూ. 631.5, స్టాప్​ లాస్​ రూ. 614, టార్గెట్​ రూ. 675

హెచ్​పీసీఎల్​:- బై రూ. 525, స్టాప్​ లాస్​ రూ. 510, టార్గెట్​ రూ. 560

ఎన్​టీపీసీ:- బై రూ. 355, స్టాప్​ లాస్​ రూ. 345, టార్గెట్​ రూ. 370

ఏమి ఆర్గానిక్స్​:- బై రూ. 1178- రూ. 1180, స్టాప్​ లాస్​ రూ. 1145, టార్గెట్​ రూ. 1234

లారస్​ ల్యాబ్స్​:- బై రూ. 416- రూ. 417, స్టాప్​ లాస్​ రూ. 410, టార్గెట్​ రూ. 430

(గమనిక:- ఈ స్టాక్స్​ టు బై లిస్ట్​.. నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

WhatsApp channel

సంబంధిత కథనం