Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్.. ఈ రూ. 270 స్టాక్‌తో భారీ లాభాలు!
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్‌ని లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 83 పాయింట్లు పెరిగి 80,050 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 16 పాయింట్లు పెరిగి 24,302 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 14 పాయింట్లు పెరిగి 53,1045 వద్దకు చేరింది.
ఈ రోజు నిఫ్టీ అవుట్‌లుక్‌పై హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి మాట్లాడుతూ.. “నిఫ్టీ ట్రెండ్ పాజిటివ్‌గా ఉంది. నిఫ్టీ గరిష్ట స్థాయిలో ఉన్నప్పటికీ, కొత్త ఆల్ టైమ్ గరిష్టాల వద్ద ఎలాంటి రివర్స్ ప్యాట్రన్ ఏర్పడే అవకాశం లేదు. ఏదేమైనా, 24400 స్థాయిల వద్ద 1.618% ఫిబోనాచి ఎక్స్ట్రాక్షన్ ఉన్నందున, ఈ కన్సాలిడేషన్ / స్వల్ప క్షీణత రాబోయే సెషన్లలో సాధ్యమవుతుంది. సపోర్ట్ 23,990 (10 రోజుల ఈఎంఏ) వద్ద ఉంది,” అని వెల్లడించారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2575.85 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2375.18 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిని తాకుతున్నాయి. ఎఫ్ఐఐలు భారీగా లాంగ్‌లు బిల్డ్ చేసుకోవడం ఇందుకు కారణం.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 35 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం కారణంగా జులై 4న ఆ దేశ స్టాక్ మార్కెట్లకు సెలవు. డౌ జోన్స్, నాస్డాక్, ఎస్ అండ్ పీ 500 సహా ట్రేడింగ్ కార్యకలాపాలు తిరిగి జులై 5న మొదలవుతాయి.
స్టాక్స్ టు బై..
భారత్ డైనమిక్స్:- రూ.1684 వద్ద కొనండి, టార్గెట్ రూ.1770, స్టాప్ లాస్ రూ.1625.
అరబిందో ఫార్మా: రూ.1254.65 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1355, స్టాప్ లాస్ రూ.1200
ఎక్సైడ్ ఇండస్ట్రీస్: రూ.566 వద్ద కొనండి, టార్గెట్ రూ.585, స్టాప్ లాస్ రూ.545.
బ్యాంక్ ఆఫ్ బరోడా: రూ.270 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.282, స్టాప్ లాస్ రూ.264.
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్: రూ.1520 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1570, స్టాప్ లాస్ రూ.1470
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం