మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 636 పాయింట్లు పడి 80,738 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 174 పాయింట్లు పతనమై 24,542 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 303 పాయింట్లు పడి 55,600 వద్దకు చేరింది.
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2853.83 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,907.97 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
జూన్‌లో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 5443.3 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 11,221.73 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 55 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
"ఇంట్రాడే మార్కెట్ ఆకృతి బలహీనంగా ఉంది. అయితే నిఫ్టీ- సెన్సెక్స్ 24,450/80,500 స్థాయిని అధిగమిస్తేనే అమ్మకాల ఒత్తిడి మరింత పెరుగుతుంది. అదే జరిగితే, దిగువన సూచీలు 24,320-24,300/80,100-80,000కు పడిపోవచ్చు. ఇండెక్స్ 24,600/81,000 పైన కదులుతుంటే, 20 రోజుల ఎస్ఎంఏ లేదా 24,700/81,300 వైపు క్విక్ పుల్‌బ్యాక్ ర్యాలీ సంభవించవచ్చు. మార్కెట్‌ని 24,760/81,500 వరకు పెంచే అవకాశం ఉంది," అని కొటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ పేర్కొన్నారు.
మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.51 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.58శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.81 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.
రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్- బై రూ. 160.3, స్టాప్ లాస్ రూ. 154, టార్గెట్ రూ. 173
బీఎస్ఈ- బై రూ. 2764.9, స్టాప్ లాస్ రూ. 2668, టార్గెట్ రూ. 2986
బజాజ్ ఫిన్సర్వ్- బై రూ. 1992, స్టాప్ లాస్ రూ. 1950, టార్గెట్ రూ. 2100
పీబీ ఫిన్‌టెక్ లిమిటెడ్- బై రూ. 1740, స్టాప్ లాస్ రూ. 1710, టార్గెట్ రూ. 1800
చంబల్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్- బై రూ. 562, స్టాప్ లాస్ రూ. 550, టార్గెట్ రూ. 550
సంబంధిత కథనం