Stocks to buy today : ఐటీసీ స్టాక్‌కి టైమ్ వచ్చింది! షేర్ ప్రైజ్ టార్గెట్ ఎంతంటే..
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్ స్టాక్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 319 పాయింట్లు పడి 77,187 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 121 పాయింట్లు పడి 23,361 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 296 పాయింట్లు కోల్పోయి 49,211 వద్దకు చేరింది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ షార్ట్ టర్మ్ ట్రెండ్.. పాజిటివ్‌గా ఉంది. 24,000- 24,100 దగ్గర స్టెబులిటీ ఉంటే.. నిఫ్టీ 24,380- 24,400 వరకు వెళ్లొచ్చు. 23,800 లెవల్స్ వద్ద నిఫ్టీకి బలమైన సపోర్ట్ ఉంది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
దేశీయ స్టాక్ మార్కెట్లో ఎఫ్ఐఐలు సెల్లింగ్ కొనసాగుతోంది. సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3958.37 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2708.23 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
జనవరి నెల మొత్తం మీద ఎఫ్ఐఐలు రూ. 87,374.66 కోట్లు విక్రయించిన ఎఫ్ఐఐలు ఫిబ్రవరి మొదటి 2 ట్రేడింగ్ సెషన్స్‌లో రూ. 5285.46 విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,532.61 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 100 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.28 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.76శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.2 శాతం పడింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
ఎం అండ్ ఎం- బై రూ . 3173.30, స్టాప్ లాస్ రూ. 3060, టార్గెట్ రూ. 3395
యూపీఎల్- బై రూ. 630.25, స్టాప్ లాస్ రూ. 608, టార్గెట్ రూ. 674
బయోకాన్- బై రూ. 364, స్టాప్ లాస్ రూ. 354, టార్గెట్ రూ. 380
బాలకృష్ణ ఇండస్ట్రీస్- బై రూ. 2732, స్టాప్ లాస్ రూ. 2680, టార్గెట్ రూ. 2800
ఐటీసీ- బై రూ. 454, స్టాప్ లాస్ రూ. 440, టార్గెట్ రూ. 475
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
మెట్రో బ్రాండ్స్: రూ.1295 వద్ద కొనండి, టార్గెట్ రూ.1386, స్టాప్ లాస్ రూ.1250;
సెంచురీ ప్లైబోర్డ్స్ (ఇండియా): రూ.830.55 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.888, స్టాప్ లాస్ రూ.801;
వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్: రూ.808.20 వద్ద కొనండి, టార్గెట్ రూ.865, స్టాప్ లాస్ రూ.780;
పీసీబీఎల్: రూ.403.45 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.432, స్టాప్ లాస్ రూ.389;
కెమికల్ అండ్ క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ: రూ.1485.5 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ.1433, స్టాప్ లాస్ రూ.1589.
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం