Stocks to buy today : స్టాక్స్ టు బై- ఈ 5 స్టాక్స్‌తో ట్రేడర్స్‌కి లాభాలు వచ్చే ఛాన్స్!
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
బడ్జెట్ 2025 కారణంగా శనివారం ఓపెన్‌లో ఉన్న దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ సెషన్‌ని ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 5 పాయింట్లు పెరిగి 77,505 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 26 పాయింట్లు పడి 23,482 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 80 పాయింట్లు కోల్పోయి 49,507 వద్దకు చేరింది.

“మార్కెట్ షార్ట్-టర్మ్ ట్రెండ్ బల్లిష్గా ఉంది. కానీ టెంపరరీ ఓవర్‌బాట్ కండీషన్ కారణంగా రేంజ్-బౌండ్ యాక్షన్‌ని మనం చూడవచ్చు. నిఫ్టీ50కి 3,270-23,100 కీలక సపోర్ట్‌గా ఉంది. 23810- 23,900 రెసిస్టెన్స్‌గా ఉంది,” అని కొటాక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
దేశీయ స్టాక్ మార్కెట్లో ఎఫ్ఐఐలు సెల్లింగ్ కొనసాగుతోంది. శనివారం ట్రేడింగ్ సెషన్లోనూ ఎఫ్ఐఐలు రూ. 1,327.09 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 824.38 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
జనవరి నెల మొత్తం మీద ఎఫ్ఐఐలు రూ. 87,374.66 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 86,591.8 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 170 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.7 శాతం పడింది. ఎస్ అండ్ పీ 500 0.5 శాతం పతనమైంది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.28 శాతం పడింది.
కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 3 దేశాలతో ‘టారీఫ్’ యుద్ధాన్ని ప్రకటించారు! ఆయన చర్యలను చైనా, కెనెడా, మెక్సికోలు తిప్పికొట్టాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో అస్థిరత నెలకొంది. ఫలితంగా యూఎస్ ఫ్యూచర్స్ డౌన్లో ఉన్నాయి.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
బజాజ్ హెల్త్‌కేర్- బై రూ. 689.15, స్టాప్ లాస్ రూ. 660, టార్గెట్ రూ. 740
షైలీ ఇంజినీరింగ్ ప్లాస్టిక్- బై రూ. 1613.4, స్టాప్ లాస్ రూ. 1560, టార్గెట్ రూ. 1730
ఐసీఐసీఐ సెక్యూరిటీస్- బై రూ. 834, స్టాప్ లాస్ రూ. 820, టార్గెట్ రూ. 860
యాక్సిస్ బ్యాంక్- బై రూ. 998, టార్గెట్ రూ. 975, స్టాప్ లాస్ రూ. 1025
డీఎల్ఎఫ్- బై రూ. 760, స్టాప్ లాస్ రూ. 745, టార్గెట్ రూ. 795
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం