Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ రూ. 100 బ్రేకౌట్​ స్టాక్​తో లాభాలకు ఛాన్స్​!-stocks to buy today 31st jan 2025 sensex and nifty50 news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ రూ. 100 బ్రేకౌట్​ స్టాక్​తో లాభాలకు ఛాన్స్​!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ రూ. 100 బ్రేకౌట్​ స్టాక్​తో లాభాలకు ఛాన్స్​!

Sharath Chitturi HT Telugu
Jan 31, 2025 08:10 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్​ స్టాక్స్​ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

స్టాక్స్​ టు బై టుడే..
స్టాక్స్​ టు బై టుడే..

దేశీయ స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 227 పాయింట్లు పెరిగి 6,760 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 86 పాయింట్లు వృద్ధిచెంది 23,249 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 146 పాయింట్లు పెరిగి 49,312 వద్దకు చేరింది.

“నిఫ్టీ50కి 23,300 దగ్గర రెసిస్టెన్స్​ కనిపిస్తోంది. అక్కడే 20 డే ఈఎంఐ ఉంది. ఇది చాలా కీలకంగా మారనుంది. ఇక్కడ పడితే 23,000- 22,700 జోన్​కి పడొచ్చు,” అని రెలిగేర్​ బ్రోకింగ్​ ఎస్​వీడీ అజిత్​ మిశ్రా తెలిపారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

దేశీయ స్టాక్​ మార్కెట్​లో ఎఫ్​ఐఐలు సెల్లింగ్​ కొనసాగుతోంది. గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 4,582.95 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2165.89 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 25 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.3 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.5 శాతం పెరిగింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.25 శాతం వృద్ధిచెందింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

ఏమీ ఆర్గన్స్​- బై రూ. 2358.65, స్టాప్​ లాస్​ రూ. 2260, టార్గెట్​ రూ. 2525

స్వరాజ్​ ఇంజిన్స్​- బై రూ. 3333.35, స్టాప్​ లాస్​ రూ. 3200, టార్గెట్​ రూ. 3550

సింజిన్​ ఇంటర్నేషనల్​- బై రూ. 762, స్టాప్​ లాస్​ రూ. 745, టార్గెట్​ రూ. 790

గ్రాన్యూల్స్​- బై రూ. 560, స్టాప్​ లాస్​ రూ. 540, టార్గెట్​ రూ. 595

సన్​ ఫార్మా- బై రూ. 1740, స్టాప్​ లాస్​ రూ. 1715, టార్గెట్​ రూ. 1775

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

బెల్: రూ.278.75 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.298, స్టాప్ లాస్ రూ.268;

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: రూ.35.38 వద్ద కొనండి, టార్గెట్ రూ.38, స్టాప్ లాస్ రూ.34;

జే అండ్ కే బ్యాంక్: రూ.99.22 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.106, స్టాప్ లాస్ రూ.95;

డోమ్స్ ఇండస్ట్రీస్: రూ.2442 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.2613, స్టాప్ లాస్ రూ.2356; భారత్

డైనమిక్స్: రూ.1267.65 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1356, స్టాప్ లాస్ రూ.1223.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం