Stocks to buy today : ఏడాదిలో చివరి రోజు- ఈ 5 బ్రేకౌట్​ స్టాక్స్​తో లాభాలకు ఛాన్స్​..!-stocks to buy today 31st december 2024 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ఏడాదిలో చివరి రోజు- ఈ 5 బ్రేకౌట్​ స్టాక్స్​తో లాభాలకు ఛాన్స్​..!

Stocks to buy today : ఏడాదిలో చివరి రోజు- ఈ 5 బ్రేకౌట్​ స్టాక్స్​తో లాభాలకు ఛాన్స్​..!

Sharath Chitturi HT Telugu
Dec 31, 2024 08:10 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్​ స్టాక్స్​ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..
స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..

దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 451 పాయింట్లు పడి 78,248 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 168 పాయింట్లు కోల్పోయి 23,645 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 358 పాయింట్లు వృద్ధిచెంది 50,953 వద్దకు చేరింది.

yearly horoscope entry point

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1893.16 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2173.86 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

డిసెంబర్​​ నెల​లో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు రూ. 12,337.26కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 29,648.14 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 160 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.97శాతం పడింది. ఎస్​ అండ్​ పీ 500​ 1.07శాతం పతనమైంది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 1.19శాతం పడింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

లాయిడ్​ మెటల్స్​- బై రూ. 1215.15, స్టాప్​ లాస్​ రూ. 1174, టార్గెట్​ రూ. 1300

కేఫిన్​ టెక్నాలజీస్​- బై రూ. 1582.8, స్టాప్​ లాస్​ రూ. 1530, టార్గెట్​ రూ. 1700

జిందాల్​ స్టీల్​ అండ్​ పవర్​- బై రూ. 918, స్టాప్​ లాస్​ రూ. 905, టార్గెట్​ రూ. 940

మాక్రో డెవలపర్స్​- బై రూ. 1420, స్టాప్​ లాస్​ రూ. 1380, టార్గెట్​ రూ. 1475

ఫెడరల్​ బ్యాంక్​- బై రూ. 200, స్టాప్​ లాస్​ రూ. 195, టార్గెట్​ రూ. 207

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

కేఎన్ఆర్ కన్​స్ట్రక్షన్స్: రూ.340.40 వద్ద కొనండి, టార్గెట్ రూ.365, స్టాప్ లాస్ రూ.330;

యూనివర్సల్ కేబుల్స్: రూ.838కే కొనండి, టార్గెట్ రూ.900, స్టాప్ లాస్ రూ.810;

అశోకా బిల్డ్​కాన్: రూ.313.20 వద్ద కొనండి, టార్గెట్ రూ.333, స్టాప్ లాస్ రూ.303;

బజాజ్ హెల్త్​కేర్: రూ.587.80, టార్గెట్ రూ.630, స్టాప్ లాస్ రూ.565;

పిరమాల్ ఫార్మా: రూ.265.30 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.285, స్టాప్ లాస్ రూ.255.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం