Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్.. బజాజ్ ఆటో, దివీస్ ల్యాబ్ షేర్లతో భారీ లాభాలు!
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవార ట్రేడింగ్ సెషన్‌ని నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్.. 668 పాయింట్లు పడి 74,503 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 183 పాయింట్లు పడి 22,705 వద్ద ముగిసింది. ఇక 641 పాయింట్ల నష్టపోయిన బ్యాంక్ నిఫ్టీ.. 48,501 వద్దకు చేరింది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీలో ప్రస్తుతం ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తోంది. 22,567- 22,480 లెవల్స్ సపోర్ట్‌గా ఉన్నాయి. 22,800- 23,110 లెవల్స్ రెసిస్టెన్స్‌గా ఉన్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు (జూన్ 4) సమీపిస్తుండటంతో ట్రేడర్లు అప్రమత్తంగా ఉండటం మంచిది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 5841.44 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5233.79 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
Stock market news today : ఇండియన్ స్టాక్ మార్కెట్లో మే నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు రూ. 40,777.37 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 50,185.95 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇదీ చూడండి:- HDFC Bank: ‘‘ఆ యూపీఐ ట్రాన్సాక్షన్స్ కు ఇకపై ఎస్ఎంఎస్ అలర్ట్స్ రావు’’: హెచ్డీఎఫ్సీ బ్యాంక్
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. గురువారం ట్రేడింగ్ సెషన్‌ని నష్టాల్లో మొదలుపెట్టే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 80 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
బుధవారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్పంగా నష్టపోయాయి. డౌ జోన్స్ 1.06శాతం పడింది. ఎస్ అండ్ పీ 500 0.74శాతం, నాస్డాక్ 0.58శాతం నష్టపోయాయి.
స్టాక్స్ టు బై..
Stocks to buy : బజాజ్ ఆటో:- బై రూ. 9070, స్టాప్ లాస్ రూ. 8850, టార్గెట్ రూ. 9450
జైడస్ వెల్నెస్:- బై రూ. 1801.4, స్టాప్ లాస్ రూ. 1740, టార్గెట్ రూ. 1900
భారత్ ఫోర్జ్:- బై రూ. 1570, స్టాప్ లాస్ రూ. 1540, టార్గెట్ రూ. 1620
ఒబేరాయ్ రియాల్టీ:- బై రూ. 1835, స్టాప్ లాస్ రూ. 1810, టార్గెట్ రూ. 1870
Divis Labs share price target : దివీస్ ల్యాబ్:- బై రూ. 4450, స్టాప్ లాస్ రూ. 4380, టార్గెట్ రూ. 4530
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం