శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 303 పాయింట్లు పెరిగి 84,059 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 81 పాయింట్లు వృద్ధిచెంది 25,638 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 237 పాయింట్లు పెరిగి 57,444 వద్దకు చేరింది.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1397.02 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 588.93 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
జూన్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 8320.48 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 69,176.47 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 20 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 కి 25,000- 25,300 లెవల్స్ సపోర్ట్‌గా ఉండొచ్చు. ఈ లెవల్స్ పైన కొనసాగేంతవరకు నిఫ్టీ50 అప్‌ట్రెండ్‌లో ఉన్నట్టే. 25,850 అనేది కీలక రెసిస్టెన్స్‌గా ఉంది. అది దాటితే నిఫ్టీ50 26,000 వరకు వెళ్లొచ్చు,” అని కొటాక్ సెక్యూరిటీస్ వీపీ- టెక్నికల్ రీసెర్చ్ అమోల్ అథవాలే తెలిపారు.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 1 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.52శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.52 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500, నాస్‌డాక్‌లు ఆల్-టైమ్ హైని టచ్ చేశాయి.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఎయిర్టెల్- బై రూ. 2027.1, స్టాప్ లాస్ రూ. 1956, టార్గెట్ రూ. 2170
ఎస్ఆర్ఎఫ్ లిమిటెడ్- బై రూ. 3174.8, స్టాప్ లాస్ రూ. 3063, టార్గెట్ రూ. 3400
ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్- బై రూ. 1850, స్టాప్ లాస్ రూ. 1820, టార్గెట్ రూ. 1890
చంబల్ ఫెర్టిలైజర్స్- కెమికెల్స్ - బై రూ. 560, స్టాప్ లాస్ రూ. 545, టార్గెట్ రూ. 590
డీఎల్ఎఫ్- బై రూ. 845, స్టాప్ లాస్ రూ. 825, టార్గెట్ రూ. 875
ఎన్డీఆర్ ఆటో కాంపోనెంట్స్: రూ.1078.55 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1150, స్టాప్ లాస్ రూ.1035;
ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్: రూ.449.35 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.477, స్టాప్ లాస్ రూ.432;
ఎల్టి ఫుడ్స్: రూ .483.25 వద్ద కొనండి, టార్గెట్ రూ .515, స్టాప్ లాస్ రూ .465;
రెడింగ్టన్: రూ.322.05 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.345, స్టాప్ లాస్ రూ.310;
ఎస్ఎంఎల్ ఇసుజు: రూ .2034.1 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ .2160, స్టాప్ లాస్ రూ .1965.
సంబంధిత కథనం