Stocks to buy today : ఈ 5 స్టాక్స్​ ట్రాక్​ చేయండి- లాభాలకు ఛాన్స్​!-stocks to buy today 30th december 2024 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ఈ 5 స్టాక్స్​ ట్రాక్​ చేయండి- లాభాలకు ఛాన్స్​!

Stocks to buy today : ఈ 5 స్టాక్స్​ ట్రాక్​ చేయండి- లాభాలకు ఛాన్స్​!

Sharath Chitturi HT Telugu
Dec 30, 2024 08:10 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

స్టాక్స్​ టు బై టుడే..
స్టాక్స్​ టు బై టుడే..

దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 227 పాయింట్లు పెరిగి 78,699 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 63 పాయింట్లు పెరిగి 23,813 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 141 పాయింట్లు వృద్ధిచెంది 51,311 వద్దకు చేరింది.

yearly horoscope entry point

“టెక్నికల్స్​ పరంగా, నిఫ్టీ తన కీలకమైన మూవింగ్​ యావరేజ్​ (200డే ఎక్స్​పొనెన్షియల్ మూవింగ్ యావరేజ్) నిలుపుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇటీవలి స్వింగ్ కనిష్ట స్థాయి 23,500 కంటే తక్కువకు పడితే, సెల్లింగ్​ ప్రెజర్​ మరింత పెరగొచ్చు. తదుపరి కీలక సపోర్ట్​ స్థాయి అయిన నవంబర్ కనిష్ట స్థాయి 23,263.15 వద్ద ఉంది,” అని అజిత్ మిశ్రా – ఎస్​వీపీ, రీసెర్చ్, రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ అన్నారు. మరోవైపు 24,100-24,400 జోన్ కీలక రెసిస్టెన్స్​గా ఉందని వివరించారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1323.29 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2544.64 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

డిసెంబర్​​ నెల​లో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు రూ. 10,444.1 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 27,474.14 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 6 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

ప్రాఫిట్​ బుకింగ్​ కారణగా శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.77శాతం పడింది. ఎస్​ అండ్​ పీ 500​ 1.11శాతం పతనమైంది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 1.49శాతం పడింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

సీయెట్​ లిమిటెడ్​- బై రూ. 3253.45, స్టాప్​ లాస్​ రూ. 3139, టార్గెట్​ రూ. 3481

కాంపస్​ యాక్టివ్​వేర్​- బై రూ. 315.80, స్టాప్​ లాస్​ రూ. 304, టార్గెట్​ రూ. 338

హెచ్​పీసీఎల్​- బై రూ. 410, స్టాప్​ లాస్​ రూ. 400, టార్గెట్​ రూ. 430

బీఈఎల్​- బై రూ. 293, స్టాప్​ లాస్​ రూ. 285, టార్గెట్​ రూ. 305

ఐసీఐసీఐ బ్యాంక్​- బై రూ. 1308, స్టాప్​ లాస్​ రూ. 1290, టార్గెట్​ రూ. 1340

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం