Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ రూ. 175 స్టాక్​తో షార్ట్​ టర్మ్​ గెయిన్స్​!-stocks to buy today 3 september 2024 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ రూ. 175 స్టాక్​తో షార్ట్​ టర్మ్​ గెయిన్స్​!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ రూ. 175 స్టాక్​తో షార్ట్​ టర్మ్​ గెయిన్స్​!

Sharath Chitturi HT Telugu
Sep 03, 2024 08:45 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

స్టాక్స్​ టు బై టుడే..
స్టాక్స్​ టు బై టుడే..

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లోగా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 194 పాయింట్లు పెరిగి 82,560 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 43 పాయింట్లు పెరిగి 25,279 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 88 పాయింట్లు పెరిగి 51,440 వద్దకు చేరింది.

సోమవారం దేశీయ ఈక్విటీ మార్కెట్ బెంచ్ మార్క్ నిఫ్టీ 50 వరుసగా 13వ సెషన్ లాభాల్లో ముగిసింది. కాగా సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో నిఫ్టీ 50 డైలీ ఛార్ట్​లో మైనర్​ లోయర్​ షాడోతో కూడిన చిన్న నెగిటివ్​ క్యాండిల్​ ఏర్పడింది.

"ఈ చార్ట్ పాటర్న్​ నారే రేంజ్​- నిదానమైన అప్​సైడ్​ మూవ్​మెంట్​ని సూచిస్తుంది,' అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి అన్నారు.

నిఫ్టీ 50 స్వల్పకాలిక ట్రెండ్ చెక్కుచెదరలేదని ఆయన అభిప్రాయపడ్డారు. "నిఫ్టీ దాదాపు 25,350 స్థాయిల (1.382% ఫిబోనాచి ఎక్స్​టెన్షన్​) వద్ద ఉన్నప్పటికీ, గరిష్టాల వద్ద గణనీయమైన రివర్సల్​ పాటర్న్​ ఏర్పడే సూచనలు లేవు. 25,400 పాయింట్ల పైన నిర్ణయాత్మక కదలిక మాత్రమే తదుపరి లక్ష్యాన్ని 25,800 స్థాయిలకు తీసుకెళుతుంది," అని నాగరాజ్​ శెట్టి అన్నారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,735.46 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 356.37 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాటగా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 17 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

ఆమెరికా స్టాక్​ మార్కెట్​లకు సోమవారం ​సెలవు. ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. డౌ జోన్స్​ 0.55శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 1.01శాతం పెరిగింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్​ 1.13 శాతం పతనమైంది.

స్టాక్స్​ టు బై..

అపోలో టైర్స్ లిమిటెడ్ (అపోలోటైర్): రూ.500కు కొనండి. రూ.520 టార్గెట్.. స్టాప్ లాస్ రూ.490.

బ్యాంక్ ఆఫ్ బరోడా (బ్యాంక్ బరోడా): రూ.254 వద్ద కొనండి. రూ.265 టార్గెట్.. స్టాప్ లాస్ రూ.248

కమిన్స్ ఇండియా లిమిటెడ్ (కమిన్సిండ్): రూ.3,807 వద్ద కొనండి. టార్గెట్ రూ.3,900; స్టాప్ లాస్ రూ.3,750

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

డీప్ ఎనర్జీ: రూ.259.40 వద్ద కొనండి, టార్గెట్ రూ.273, స్టాప్ లాస్ రూ.250

ముంజాల్ ఆటో: రూ.124 వద్ద కొనండి, టార్గెట్ రూ.131.50, స్టాప్ లాస్ రూ.119.50

ఐఎస్ఎఫ్టీ: రూ.175.16 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.184, స్టాప్ లాస్ రూ.168

సైబర్టెక్ సిస్టెమ్స్: రూ.288.10 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.307, స్టాప్ లాస్ రూ.281

ధున్సేరి ఇన్వెస్ట్మెంట్స్: రూ .1771.80 వద్ద కొనండి, టార్గెట్ రూ .1865, స్టాప్ లాస్​ రూ .1710

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

సంబంధిత కథనం