Stocks to buy today : ఈ రూ. 98 స్టాక్‌తో షార్ట్ టర్మ్‌లో మంచి ప్రాఫిట్స్..!
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్‌ని లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్.. 128 పాయింట్లు పెరిగి 74,611 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 43 పాయింట్లు పెరిగి 22,648 వద్ద ముగిసింది. ఇక 166 పాయింట్లు కోల్పోయిన బ్యాంక్ నిఫ్టీ.. 49,231 వద్దకు చేరింది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీలో రేంజ్ బౌండ్ యాక్షన్ కనిపించే అవకాశం ఉంది. 22,800 లెవల్స్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది. 22,550 దగ్గర సపోర్ట్ ఉందని.. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 965 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1352 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని భారీ లాభాల్లో మొదలుపెట్టే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 110 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
ఇదీ చూడండి:- Demat account: అంతర్జాతీయ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా?.. అందుకు 4 మార్గాలున్నాయి..
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. డౌ జోన్స్ 0.85శాతం, నాస్డాక్ 1.51శాతం మేర లాభపడ్డాయి. ఎస్ అండ్ పీ 500 0.91శాతం లాభాల్లో ముగిసింది.
స్టాక్స్ టు బై..
Stocks to buy : బజాజ్ ఆటో:- బై రూ.9110, స్టాప్ లాస్ రూ. 8740, టార్గెట్ రూ. 9842
పెట్రోనెట్ ఎల్ఎన్జీ:- బై రూ. 320.75, స్టాప్ లాస్ రూ. 309, టార్గెట్ రూ. 345
ఎన్‌హెచ్‌పీసీ:- బై రూ. 98, స్టాప్ లాస్ రూ. 96, టార్గెట్ రూ. 103
బిర్లా కార్పొరేషన్:- బై రూ. 1492.7, స్టాప్ లాస్ రూ. 1462, టార్గెట్ రూ. 1550
జిందాల్ స్టీల్:- బై రూ. 734, స్టాప్ లాస్ రూ. 720, టార్గెట్ రూ. 770
బీఎప్ యుటిలిటీస్:- బై రూ. 891- రూ. 892, స్టాప్ లాస్ రూ. 877, టార్గెట్ రూ. 915
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం