Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్! పేటీఎం షేర్ ప్రైజ్ టార్గెట్ ఇదే- లాభాలకు ఛాన్స్!
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్ స్టాక్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1436 పాయింట్లు పెరిగి 79,944 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 446 పాయింట్లు పెరిగి 24,189 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 545 పాయింట్లు వృద్ధిచెంది 51,606 వద్దకు చేరింది.
ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ రూపక్ దే మాట్లాడుతూ.. “ఇటీవలి సెషన్లలో పలు విఫల ప్రయత్నాల తర్వాత నిఫ్టీ50 200 డీఎంఏ పైన కదలాడింది. దీనికి తోడు డైలీ టైమ్‌ఫ్రేమ్‌లో సూచీ 21 ఈఎంఏను దాటి బుల్లిష్ ట్రెండ్‌ను ధృవీకరించింది. ఆర్ఎస్ఐ కూడా బుల్లిష్ క్రాస్ఓవర్లో ఉంది. బలమైన ముగింపు తర్వాత సూచీ 'బై ఆన్ డిప్స్' ఆప్షన్ని బలోపేతం చేసింది. సపోర్ట్ 24,000 వద్ద ఉండగా.. నిఫ్టీ50 24,500 వరకు వెళ్లొచ్చు,” అని అన్నారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1506.75 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 22.14 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
జనవరి నెల మొదటి రెండు ట్రేడింగ్ సెషన్స్‌లో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు రూ. 275.96కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1712.51 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 95 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.3ా6తం పడింది. ఎస్ అండ్ పీ 500 0.22శాతం పతనమైంది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.16శాతం పడింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
పాలసీబజార్- బై రూ. 2203.25, స్టాప్ లాస్ రూ. 2120, టార్గెట్ రూ. 2350
పర్ల్ గ్లోబల్ ఇండస్ట్రీస్- బై రూ. 1533.6, స్టాప్ లాస్ రూ. 1480, టార్గెట్ రూ. 1616
ఏబీ క్యాపిటల్- బై రూ. 184, స్టాప్ లాస్ రూ. 177, టార్గెట్ రూ. 195
ఆర్ఈసీ- బై రూ. 520, స్టాప్ లాస్ రూ. 510, టార్గెట్ రూ. 535
పేటీఎం- బై రూ. 980, స్టాప్ లాస్ రూ. 960, టార్గెట్ రూ. 1010
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
అపోలో మైక్రో సిస్టమ్స్: రూ.123.96 వద్ద కొనండి, టార్గెట్ రూ.133, స్టాప్ లాస్ రూ.119
రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్: రూ.322.65 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.345, స్టాప్ లాస్ రూ.311
డీసీఎక్స్ సిస్టమ్స్: రూ.393 వద్ద కొనండి, స్టాప్ లాస్ రూ.355
ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్ లిమిటెడ్: రూ.394.50 వద్ద కొనండి, టార్గెట్ రూ.422, స్టాప్ లాస్ రూ.380
ట్రాన్స్ఫార్మర్స్ అండ్రెక్టిఫయర్స్: రూ .1230 వద్ద కొనండి, టార్గెట్ రూ .1300, స్టాప్ లాస్ రూ .1186.
సంబంధిత కథనం