Stocks to buy today : ఈ రూ. 400 దగ్గర ఉన్న స్టాక్ కొంటే.. భారీ లాభాలు!
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
Stocks to buy today : గురునానక్ జయంతి నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లకు సోమవారం సెలవు. ఇక గత శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో.. దేశీయ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 48 పాయింట్ల నష్టంతో 65,970 వద్ద స్థిరడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 7 పాయింట్లు కోల్పోయి 19,795 వద్ద ముగిసింది. ఇక 192 పాయింట్లు పెరిగిన బ్యాంక్ నిఫ్టీ.. 43,769 వద్దకు చేరింది.
"నవంబర్ 30తో ముగిసే 5 రాష్ట్రాల ఎన్నికలు.. స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపిస్తాయి. డిసెంబర్ 3 ఫలితాల తర్వాత.. మార్కెట్లు ఒక డైరెక్షన్‌ని తీసుకునే అవకాశం ఉంది. 19,900 దాటితే నిఫ్టీ మరింత పైకి వెళ్లొచ్చు. 19,600 లెవల్ సపోర్ట్‌గా ఉంది," అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2625.21 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 134.46 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
Stock market news today : ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ సూచీలు స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 40 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
నేడు టాటా టెక్ ఐపీఓ అలాట్మెంట్..!
బ్లాక్‌బస్టర్ సబ్‌స్క్రిప్షన్‌తో మొత్తం ఇండియాలో హాట్ టాపిక్‌గా నిలిచిన టాటా టెక్నాలజీస్ ఐపీఓ అలాట్మెంట్ స్టేటస్ కోసం అనేకమంది ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ ఐపీఓ అలాట్మెంట్ స్టేటస్.. మంగళవారం లైవ్ అవుతుందని తెలుస్తోంది. అలాట్మెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? అనేది తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. డౌ జోన్స్ 0.16శాతం, ఎస్ అండ్ పీ 500 0.2శాతం, నాస్డాక్ 0.07శాతం మేర నష్టపోయాయి.
స్టాక్స్ టు బై..
Intraday stocks to buy : లూపిన్:- బై రూ. 1243, స్టాప్ లాస్ రూ. 1211, టార్గెట్ రూ. 1285
టాటా కన్జ్యూమర్స్:- బై రూ. 930.85, స్టాప్ లాస్ రూ. 910, టార్గెట్ రూ. 970
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ):- బై రూ. 561, స్టాప్ లాస్ రూ. 548, టార్గెట్ రూ. 575
హావెల్స్ ఇండియా:- బై రూ. 1295, స్టాప్ లాస్ రూ. 1280, టార్గెట్ రూ. 1325
Adani power share price target : అదానీ పవర్:- బై రూ. 395- రూ. 398, స్టాప్ లాస్ రూ. 835, టార్గెట్ రూ. 930
భారత్ ఫోర్జ్:- బై రూ. 1110- రూ. 1120, స్టాప్ లాస్ రూ. 1075, టార్గెట్ రూ. 1200
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ షార్ట్ టర్మ్ ట్రెండ్ పాజిటివ్‌గానే ఉంది.
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం