Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్.. 20 పాయింట్లు పడి 75,390 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 25 పాయింట్లు పడి 22,932 వద్ద ముగిసింది. ఇక 310 పాయింట్ల పెరిగిన బ్యాంక్ నిఫ్టీ.. 49,282 వద్దకు చేరింది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం నిఫ్టీ అప్‌ట్రెండ్‌లో ఉన్నప్పటికీ.. 23150 వద్ద బలమైన రెసిస్టెన్స్ ఉంది. పైగా ఛార్ట్‌లో వీక్నెస్ కనిపిస్తోంది.
Stock market news today : సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 541.22 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 922.6 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇండియన్ స్టాక్ మార్కెట్లో మే నెలలో ఎఫ్ఐఐలు రూ. 35001.1 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 41,720.49 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని ఫ్లాట్‌గా మొదలుపెట్టే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 35 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
US stock market latest updates : సోమవారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. డౌ జోన్స్ 0.01శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.7శాతం, నాస్డాక్ 1.1శాతం లాభపడ్డాయి.
Stocks to buy : ఇండియా హోటల్స్:- బై రూ. 581, స్టాప్ లాస్ రూ. 560, టార్గెట్ రూ. 618
గోడ్రేజ్ కన్జ్యూమర్ ప్రాడక్ట్స్:- బై రూ. 1329, స్టాప్ లాస్ రూ. 1290, టార్గెట్ రూ .1410
ఇన్ఫోనిస్:- బై రూ. 1472, స్టాప్ లాస్ 1430, టార్గెట్ రూ. 1520.
వోల్టాస్:- బై రూ. 1408, స్టాప్ లాస్ రూ. 1380, టార్గెట్ రూ. 1450
బ్యాంక్ ఆఫ్ బరోడా:- బై రూ. 270, స్టాప్ లాస్ రూ. 263, టార్గెట్ రూ. 282
జిందాల్ సా:- బై రూ. 565.7, స్టాప్ లాస్ రూ. 554, టార్గెట్ రూ. 587
బ్యాంక్ ఆఫ్ ఇండియా:- బై రూ. 132.4, స్టాప్ లాస్ రూ. 129.5, టార్గెట్ రూ. 140
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్:- బై రూ. 634.4, స్టాప్ లాస్ రూ. 622, టార్గెట్ రూ. 665
సంబంధిత కథనం