Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్‌ని భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 569 పాయింట్లు పెరిగి 79,243 వద్ద స్థిరపడింది. నిఫ్టీ.. 176 పాయింట్ల లాభంతో 24,044 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం.. 59 పాయింట్లు కోల్పోయి 5,811 వద్దకు చేరింది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ షార్ట్ టర్మ్ ట్రెండ్.. పాజిటివ్‌గా ఉంది. 24,000- 24,100 దగ్గర స్టెబులిటీ ఉంటే.. నిఫ్టీ 24,380- 24,400 వరకు వెళ్లొచ్చు. 23,800 లెవల్స్ వద్ద నిఫ్టీకి బలమైన సపోర్ట్ ఉంది.
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 7658.77 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3605.93 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
ఎఫ్ఐఐలు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 2060.56 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. డీఐఐలు రూ. 21,974.84 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అందుకే స్టాక్ మార్కెట్లు పెరుగుతున్నాయి.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 150 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
గురువారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. డౌ జోన్స్ 0.09శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.09శాతం, నాస్డాక్ 0.3శాతం మేర పెరిగింది.
ఆశాహీ సోంగ్వాన్:- బై రూ. 446.9, స్టాప్ లాస్ రూ. 430,టార్గెట్ రూ. 465
బేయర్ క్రాప్:- బై రూ. 6653.9, స్టాప్ లాస్ రూ. 6430, టార్గెట్ రూ. 7000
టాటా మోటార్స్:- బై రూ. 972, స్టాప్ లాస్ రూ. 945, టార్గెట్ రూ. 995
డీమార్ట్:- బై రూ. 4930, స్టాప్ లాస్ రూ. 4750, టార్గెట్ రూ. 5100
అపోలో హాస్పిటల్స్:- బై రూ. 6190, స్టాప్ లాస్ రూ. 6350, టార్గెట్ రూ. 6060
సంబంధిత కథనం