Stocks to buy : లార్జ్ క్యాప్ స్టాక్స్‌కి టైమ్ వచ్చింది- L&T, M&M షేర్ ప్రైజ్ టార్గెట్స్ ఇవే..
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 824 పాయింట్లు పడి 75,366 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 263 పాయింట్లు కోల్పోయి 22,829 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 303 పాయింట్లు పడి 48,064 వద్దకు చేరింది.

“ప్రస్తుత మార్కెట్ స్ట్రక్చర్ బలహీనంగా, అస్థిరంగా ఉందని మేము నమ్ముతున్నాము. నిఫ్టీ50, సెన్సెక్స్ 23,000- 76,300 స్థాయిలను కీలకంగా మారాయి. ఈ పరిమితికి దిగువన ట్రేడవుతున్నంత కాలం బలహీన సెంటిమెంట్ కొనసాగే అవకాశం ఉంది," అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అన్నారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
దేశీయ స్టాక్ మార్కెట్లో ఎఫ్ఐఐలు సెల్లింగ్ కొనసాగుతోంది. సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 5,015.46 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6642.15 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
జనవరి నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు రూ. 74,095.6 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 73,586.65 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 90 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.65శాతం పడింది. ఎస్ అండ్ పీ 500 1.46శాతం పతనమైంది.
ఇక డీప్‌సీక్ ఐఏ సంచలనంతో అమెరికా టెక్ ఇండెక్స్ నాస్డాక్ 3.07శాతం పడింది. ఎన్విడియా స్టాక్ దాదాపు 17శాతం పడి ఒక్క ట్రేడింగ్ సెషన్లో 600 బిలియన్ డాలర్లను పోగొట్టుకుంది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
బ్లూడార్ట్ ఎక్స్‌ప్రెస్- బై రూ. 6593.3, స్టాప్ లాస్ రూ. 6362, టార్గెట్ రూ. 7055
యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్- బై రూ. 1246.4, స్టాప్ లాస్ రూ. 1203, టర్గెట్ రూ. 1334
ఎం అండ్ ఎం- బై రూ. 2830, స్టాప్ లాస్ రూ. 2780, టార్గెట్ రూ .2900
ఎల్ అండ్ టీ- బై రూ. 3470, స్టాప్ లాస్ రూ. 3425, టార్గెట్ రూ. 3545
ఇండిగో- బై రూ. 4175, స్టాప్ లాస్ రూ. 4120, టార్గెట్ రూ. 4250
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం