Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​! ఈ రూ. 120 స్టాక్​లో ట్రేడ్​కి ఛాన్స్​..-stocks to buy today 27th december 2024 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ అలర్ట్​! ఈ రూ. 120 స్టాక్​లో ట్రేడ్​కి ఛాన్స్​..

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​! ఈ రూ. 120 స్టాక్​లో ట్రేడ్​కి ఛాన్స్​..

Sharath Chitturi HT Telugu
Dec 27, 2024 08:10 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..
స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..

దేశీయ స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ ఫ్లాట్​గా 78,472 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 223 పాయింట్లు పెరిగి 23,750 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 62 పాయింట్లు పడి 51,171 వద్దకు చేరింది.

yearly horoscope entry point

“నిఫ్టీకి ఇమ్మీడియేట్​ బ్రేకౌట్​ లెవల్​ 23,850 లేదా 200 రోజుల ఎస్ఎంఏ. ఈ స్థాయిని దాటితే మార్కెట్ 23,950-24,000 వరకు వెళ్లొచ్చు. 23,650 దిగువకు పడిపోతే 23,550-23,500 స్థాయిలను రీటెస్ట్​ చేయవచ్చు,” అని కోటాక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2376.671 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3336.16 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

డిసెంబర్​​ నెల​లో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు రూ. 9120.81 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 24,929.5 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 3 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.7శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.04శాతం పతనమైంది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.05శాతం పడింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

ఇండిగో- బై రూ. 4725, స్టాప్​ లాస్​ రూ. 4555, టార్గెట్​ రూ. 5050

మ్యాన్​ ఇన్​ఫ్రాకస్ట్రక్షన్​- బై రూ. 244.2, స్టాప్​ లాస్​ రూ. 235, టార్గెట్​ రూ. 260

యూనియన్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా- బై రూ. 119, స్టాప్​ లాస్​ రూ. 115, టార్గెట్​ రూ. 130

హింద్​పెట్రో- బై రూ. 420, స్టాప్​ లాస్​ రూ. 412, టార్గెట్​ రూ. 435

గోద్రేజ్​ ఇండస్ట్రీస్​- బై రూ. 1130, స్టాప్​ లాస్​ రూ. 1090, టార్గెట్​ రూ. 1180

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం