మే 26 : ఈ రోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది? ఈ బ్రేకౌట్​ స్టాక్స్​లో ట్రేడింగ్​ బెస్ట్​!-stocks to buy today 26th may 2025 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  మే 26 : ఈ రోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది? ఈ బ్రేకౌట్​ స్టాక్స్​లో ట్రేడింగ్​ బెస్ట్​!

మే 26 : ఈ రోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది? ఈ బ్రేకౌట్​ స్టాక్స్​లో ట్రేడింగ్​ బెస్ట్​!

Sharath Chitturi HT Telugu

ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్​ స్టాక్స్​ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

స్టాక్​ మార్కెట్​ లేటెస్ట్​ అప్డేట్స్​..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 769 పాయింట్లు పెరిగి 81,721 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 243 పాయింట్లు వృద్ధిచెంది 24,853 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 457 పాయింట్లు పెరిగి 55,398 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,794.59 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 299.78 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 40 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“బెంచ్ మార్క్ నిఫ్టీ50 ఇండెక్స్​కి 24600, 24450 స్వల్ప కాలానికి కీలక మద్దతు జోన్లు కాగా, 25000 రెసిస్టెన్స్​ జోన్​గా ఉంటుంది. 25000 పైన విజయవంతమైన బ్రేకౌవుట్ మార్కెట్​ని 25150-25500 వరకు తీసుకెళుతుంది. మరోవైపు, 24450 దిగువన, సెంటిమెంట్ మారవచ్చు,” అని కోటక్ సెక్యూరిటీస్ విపి-టెక్నికల్ రీసెర్చ్ అమోల్ అథవాలే అన్నారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.61 శాతం పడింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.67శాతం పతనమైంది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 1 శాతం పడింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో లాభాల్లో కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

బీహెచ్​ఈఎల్​- బై రూ. 254.8, స్టాప్​ లాస్​ రూ .245, టార్గెట్​ రూ. 273

నెస్లే ఇండియా- బై రూ. 2414, స్టాప్​ లాస్​ రూ. 2329, టార్గెట్​ రూ. 2583

ఎస్​బీఐ లైఫ్​ ఇన్సూరెన్స్​ కంపెనీ- బై రూ. 1798, స్టాప్​ లస్​ రూ. 1770, టార్గెట్​ రూ. 1860

యాక్సిస్​ బ్యాంక్​- బై రూ 1210, స్టాప్​ లాస్​ రూ. 1175, టార్గెట్​ రూ. 1250

డీఎల్​ఎఫ్​- బై రూ. 775, స్టాప్​ లాస్​ రూ. 745, టార్గెట్​ రూ. 795

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

బ్రెయిన్బీస్ సొల్యూషన్స్ లిమిటెడ్ (ఫస్ట్క్రై): రూ.374కే కొనొచ్చు. రూ.400 టార్గెట్.. స్టాప్ లాస్ రూ.360.

ఈఐడీ ప్యారీ ఇండియా లిమిటెడ్ (ఈఐడీటీ): రూ.999.25 వద్ద కొనండి. రూ.1,070 టార్గెట్ స్టాప్ లాస్ రూ.964 వద్ద ఉంది.

రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (రెలిన్ఫ్రా): రూ.305.45 వద్ద కొనండి. రూ.327 టార్గెట్.. రూ.294 వద్ద స్టాప్ లాస్..

ఫస్ట్సోర్స్ సొల్యూషన్స్ లిమిటెడ్ (ఎఫ్ఎస్ఎల్): రూ.387.10 వద్ద కొనండి. రూ.415 టార్గెట్.. స్టాప్ లాస్ రూ.373 వద్ద ఉంది.

బిర్లా కేబుల్ లిమిటెడ్ (బిర్లాకేబుల్): రూ.191.56 వద్ద కొనండి. రూ.206 టార్గెట్.. రూ.184 వద్ద స్టాప్ లాస్..

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం