Stocks to buy today : ఈ రూ. 115 స్టాక్​తో షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు.. ట్రాక్​ చేయండి-stocks to buy today 26th march 2024 sense and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ఈ రూ. 115 స్టాక్​తో షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు.. ట్రాక్​ చేయండి

Stocks to buy today : ఈ రూ. 115 స్టాక్​తో షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు.. ట్రాక్​ చేయండి

Sharath Chitturi HT Telugu
Mar 26, 2024 09:01 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

స్టాక్స్​ టు బై లిస్ట్​ టుడే..
స్టాక్స్​ టు బై లిస్ట్​ టుడే..

Stocks to buy today : మూడు రోజుల సుదీర్ఘ విరామం తర్వాత.. దేశీయ స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ఓపెన్​ కానున్నాయి. శని-ఆదివారాలతో పాటు.. హోలో నేపథ్యంలో సోమవారం స్టాక్​ మార్కెట్​లు సెలవు తీసుకున్నాయి. ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ సూచీలు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 191 పాయింట్ల లాభంతో 72,831 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 85 పాయింట్లు పెరిగి 22,097 వద్ద నుగిసింది. 180 పాయింట్లు పెరిగిన బ్యాంక్​ నిఫ్టీ.. 46,864 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 3309.76 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3764.87 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

Stock market news today : ఫిబ్రవరిలో నెట్​ సెల్లర్లు​గా ఉన్న ఎఫ్​ఐఐలు.. మార్చ్​లో కాస్త పాజిటివ్​పైపు టర్న్​ అయ్యారు. ఈ నెలల ఇప్పటివరకు రూ.942.71 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ సూచీలు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్టీ నిఫ్టీ 40 పాయింట్ల లాస్​లో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగిశాయి. డౌ జోన్స్​ 0.41శాతం నష్టపోగా.. ఎస్​ అండ్​ పీ 500 0.31శాతం, నాస్​డాక్​ 0.27శాతం డౌన్​లో ముగిశాయి.

స్టాక్స్​ టు బై..

Stocks to buy : కమిన్స్​ ఇండియా:- బై రూ. 2930.8, స్టాప్​ లాస్​ రూ. 2844, టార్గెట్​ రూ. 3033.

ఐసీఐసీఐ బ్యాంక్​:- బై రూ. 1090, స్టాప్​ లాస్​ రూ. 1075, టార్గెట్​ రూ. 1125

ఏషియన్​ పెయింట్స్​:- బై రూ. 2841, స్టాప్​ లాస్​ రూ. 2780, టార్గెట్​ రూ. 2960

శ్రీరామ్​ ప్రాపర్టీస్​:- బై రూ. 114- రూ. 115, స్టాప్​ లాస్​ రూ. 112, టార్గెట్​ రూ. 122

ఇండియన్​ సిమెంట్స్​:- బై రూ. 206- రూ. 207, స్టాప్​ లాస్​ రూ. 202, టార్గెట్​ రూ. 217

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

సంబంధిత కథనం