Stocks to buy today : స్టాక్స్​ టు బై.. ఈ రూ. 180 స్టాక్​తో భారీ లాభాలు!-stocks to buy today 26 july 2024 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : స్టాక్స్​ టు బై.. ఈ రూ. 180 స్టాక్​తో భారీ లాభాలు!

Stocks to buy today : స్టాక్స్​ టు బై.. ఈ రూ. 180 స్టాక్​తో భారీ లాభాలు!

Sharath Chitturi HT Telugu

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​..

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​ని స్వల్ప నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 109 పాయింట్లు పడి 80,039 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 7 పాయింట్లు కోల్పోయి 24,406 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ మాత్రం 428 పాయింట్లు పడి 50,889 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం నిఫ్టీలో ఇంకా పాజిటివిటీ కనిపిస్తోంది. “అంతర్జాతీయ మార్కెట్​లు పతనమైనా, దేశీయ సూచీలు పెద్దగా పడలేదు. పైగా నిఫ్టీ 20 డే ఈఎంఏకి పైనా ట్రేడ్​ అవుతోంది. ఇది సానుకూల విషయం,” అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు. 1,2 ట్రేడింగ్​ సెషన్స్​ తర్వాత నిఫ్టీలో షార్ప్​ అప్​ట్రెండ్​ కనిపించే అవకాశం ఉందన్నారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2605.49 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 24312.69 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఎఫ్​ఐఐలు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 14396.99 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. డీఐఐలు రూ. 6114.56 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 30 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగిశాయి. డౌ జోన్స్​ 0.2శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.51శాతం పడింది. నాస్​డాక్​ 1.08శాతం మేర నష్టపోయింది.

చమురు ధరలు..

చమురు ధరలు ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి. బ్రెంట్​ క్రూడ్​ ఫ్యూచర్స్​ 0.02శాతం పెరిగి బ్యారెల్​కు 82.35 డాలర్లకు చేరింది.

స్టాక్స్​ టు బై..

ఐఓసీ: రూ.177 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.185, స్టాప్ లాస్ రూ.173

వరుణ్ బేవరేజెస్: రూ.1652 వద్ద కొనండి, టార్గెట్ రూ.1720, స్టాప్ లాస్ రూ.1620

బయోకాన్: రూ .362 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ .380, స్టాప్ లాస్ రూ .353

ఆర్పీపీ ఇన్ఫ్రా: రూ.197 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.207, స్టాప్ లాస్ రూ.190

హెస్టర్ బయోసైన్సెస్: రూ.3140 వద్ద కొనండి, టార్గెట్ రూ.3333, స్టాప్ లాస్ రూ.3040

కాన్ఫిడెన్స్ పెట్రోలియం: రూ.93.45 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.98, స్టాప్ లాస్ రూ.90.50

ఖైతాన్ కెమికల్స్: రూ.83.90 వద్ద కొనండి, టార్గెట్ రూ.88, స్టాప్ లాస్ రూ.80.50

ఇండియా మోటార్ పార్ట్స్ అండ్ యాక్సెసరీస్ లేదా ఇంపాల్: రూ.1255 వద్ద కొనండి, టార్గెట్ రూ.1315, స్టాప్ లాస్ రూ.1210.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

సంబంధిత కథనం