Stocks to buy today : స్టాక్​ మార్కెట్​లు పతనం- కానీ ఈ స్టాక్స్​లో ట్రేడ్​తో లాభాలు!-stocks to buy today 25th october 2024 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : స్టాక్​ మార్కెట్​లు పతనం- కానీ ఈ స్టాక్స్​లో ట్రేడ్​తో లాభాలు!

Stocks to buy today : స్టాక్​ మార్కెట్​లు పతనం- కానీ ఈ స్టాక్స్​లో ట్రేడ్​తో లాభాలు!

Sharath Chitturi HT Telugu
Oct 25, 2024 08:15 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

స్టాక్స్​ టు బై టుడే..
స్టాక్స్​ టు బై టుడే..

దేశీయ స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 17 పాయింట్లు పడి 80,065 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 36 పాయింట్లు కోల్పోయి 24,399 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 292 పాయింట్ల పెరిగితో 51,531 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం నిఫ్టీ50లో నెగిటివ్​ ట్రెండ్​ కొనసాగుతోంది.

“నిఫ్టీ50 గురువారం సానుకూలంగానే ఓపెన్​ అయినా, అనంతరం సైడ్​వేస్​లోకి వెళ్లి స్వల్పంగా నష్టపోయింది. బ్యాంకింగ్​, ఫైనాన్షియల్స్​లో అమ్మకాలు, ఎఫ్​ఎంసీజీలో విక్రయాలు కనిపించాయి,” అని మోతీలాల్​ ఓస్వాల్​ ఫైనాన్షియల్​ సర్వీసెస్​ హెడ్​ రీసెర్చ్​, వెల్త్​ మేనేజ్​మెంట్​ సిద్ధార్త ఖేంక తెలిపారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 5,062.45 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,620.47 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

అక్టోబర్ నెల​లో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు ఏకంగా రూ. 97205.42 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 92,931.54 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 5 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.33శాతం పడింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.21శాతం పెరిగింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.76శాతం వృద్ధి చెందింది.

టెస్లా స్టాక్​ దశాబ్ద కాలంలోనే బిగ్గెస్ట్​ సింగిల్ డే గెయిన్​ని చూసింది. 21.9శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

అశోక్ లేలాండ్: రూ.217 వద్ద కొనుగోలు, టార్గెట్ ధర రూ.223, స్టాప్​లాస్​ రూ.212

ఎంక్యూర్​ ఫార్మాస్యూటికల్స్: రూ.1,390 వద్ద కొనుగోలు, టార్గెట్ ధర రూ.1,450, స్టాప్​లాస్​ రూ.1,365

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ): రూ .795 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ ధర రూ .810, స్టాప్​లాస్​ రూ .780

రిలయన్స్ ఇండస్ట్రీస్: రూ.2,675-2,680 శ్రేణిలో, టార్గెట్ ధర శ్రేణి: రూ.2,698-2,715, స్టాప్​లాస్ రూ.2,650

పేటీఎం: రూ.755-765, టార్గెట్ ధర రేంజ్: రూ.785-800-810, స్టాప్​లాస్ రూ.728.

భారత్ ఫోర్జ్: రూ.1,428 వద్ద కొనండి, టార్గెట్ రూ.1,450, స్టాప్ లాస్ రూ.1,410;

టైటాన్​​- .3,333 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.3,420, స్టాప్ లాస్ రూ.3,300;

కోరమాండల్ ఇంటర్నేషనల్: రూ.1,641 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1,720, స్టాప్ లాస్ రూ.1,600

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం