Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​- నేటి ట్రేడ్​ సెటప్​, స్టాక్స్​ టు బై లిస్ట్​ వివరాలు..-stocks to buy today 25th march 2025 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ అలర్ట్​- నేటి ట్రేడ్​ సెటప్​, స్టాక్స్​ టు బై లిస్ట్​ వివరాలు..

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​- నేటి ట్రేడ్​ సెటప్​, స్టాక్స్​ టు బై లిస్ట్​ వివరాలు..

Sharath Chitturi HT Telugu

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్​ స్టాక్స్​ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..

దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​​ని భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1079 పాయింట్లు పెరిగి 77,984 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 308 పాయింట్లు పెరిగి 23,658 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 1111 పాయింట్లు వృద్ధిచెంది 51,705 వద్దకు చేరింది.

“23,600 వద్ద ఉన్న రెసిస్టెన్స్​ని నిఫ్టీ50 బ్రేక్​ చేసి పైకి వెళ్లింది. ఫలితంగా నిఫ్టీలో ట్రెండ్​ స్ట్రాంగ్​ పాజిటివ్​గా ఉంది. 23,500 వద్ద సపోర్ట్​ కనిపిస్తోంది. దానికన్నా కిందకు వెళితే స్వల్ప కరెక్షన్​ ఎదుర్కోవచ్చు,” అని ఎల్​కేపీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ ఎనలిస్ట్​ రూపక్​ డే తెలిపారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 3055.76 కోట్లు విలువ చేసే షేర్లను కొనగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 98.54 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

మార్చ్​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు రూ. 12,356.37 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 30,886.73 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 60 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 1.4 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 1.78శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 2.627శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో లాభాల్లో కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

కిమ్స్​- బై రూ. 639.6, స్టాప్​ లాస్​ రూ. 615, టార్గెట్​ రూ. 685

భారత్​ డైనమిక్స్​ లిమిటెడ్​- బై రూ. 1359.5, స్టాప్​ లాస్​ రూ. 1313, టార్గెట్​ రూ. 1450

జుబీలియంట్​ ఫుడ్​వర్క్స్​- బై రూ. 658, స్టాప్​ లాస్​ రూ. 640, టార్గెట్​ రూ. 690

పవర్​ గ్రిడ్​- బై రూ. 292, స్టాప్​ లాస్​ రూ. 287, టార్గెట్​ రూ. 300

మాక్రోటెక్​ డెవలపర్స్​- బై రూ. 1220, స్టాప్​ లాస్​ రూ. 1190, టార్గెట్​ రూ. 1260

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమ్స్​: రూ.143.24 వద్ద కొనండి, టార్గెట్ రూ.154, నష్టం రూ.138;

బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్: రూ.422.25 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.452, స్టాప్ లాస్ రూ.407;

చాలెట్ హోటల్స్: రూ.864.20 వద్ద కొనండి, టార్గెట్ రూ.925, స్టాప్ లాస్ రూ.833;

హిమాద్రి స్పెషాలిటీ కెమికల్: రూ.458.05 వద్ద కొనండి, టార్గెట్ రూ.490, స్టాప్ లాస్ రూ.442;

రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్: రూ.132.15, టార్గెట్ రూ.141, స్టాప్ లాస్ రూ.128.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం