Stocks to buy today : రూ. 340 దగ్గర ఉన్న ఈ స్టాక్ కొంటే.. షార్ట్ టర్మ్‌లో భారీ లాభాలు పక్కా!
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 6 పాయింట్లు కోల్పోయి 66,018 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో 19,802 వద్ద ముగిసింది. ఇక 128 పాయింట్లు పెరిగిన బ్యంక్ నిఫ్టీ.. 43,577 వద్దకు చేరింది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. గత కొన్ని ట్రేడింగ్ సెషన్స్ నుంచి నిఫ్టీ రేంజ్ బౌండ్ మూవ్‌మెంట్‌ని కొనసాగిస్తోంది. 19,850 లెవల్స్ దాటితే మరింత అప్‌ట్రెండ్ మూమెంట్ కనిపించొచ్చు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 255.53 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. డీఐఐలు కూడా రూ. 457.39 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
Stock market news today : కాగా.. ఈ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు రూ. 7726.93 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 9680.38 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
మరోవైపు.. దేశీయ సూచీలు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని ఫ్లాట్‌గా మొదలుపెట్టే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 15 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
అమెరికా సూచీలు గురువారం మూతపడి ఉన్నాయి. థ్యాంక్స్ గివింగ్ హాలీడే నేపథ్యంలో అక్కడి మార్కెట్లు సెలవు తీసుకున్నాయి.
స్టాక్స్ టు బై..
HAL share price target : హెచ్ఏఎల్:- బై రూ. 2146.25, స్టాప్ లాస్ రూ. 2085, టార్గెట్ రూ. 2285.
ఆర్ఈసీ:- బై రూ. 341.25, స్టాప్ లాస్ రూ. 330, టార్గెట్ రూ. 362
పీఎల్ ఇండస్ట్రీస్:- బై రూ. 3765, స్టాప్ లాస్ రూ. 3700, టార్గెట్ రూ. 3880.
మెక్‌డావెల్-ఎన్ (యునైటెడ్ స్పిరిట్స్):- బై రూ. 1060, స్టాప్ లాస్ రూ. 1040, టార్గెట్ రూ. 1100
Stocks to buy దీపక్ నైట్రేట్:- బై రూ. 2000- రూ. 2206, స్టాప్ లాస్ రూ. 2170, టార్గెట్ రూ. 2280
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం