Stocks to buy today : బడ్జెట్ ప్రెడిక్షన్- ఈ స్టాక్స్‌లో ట్రేడ్ చేస్తే భారీ లాభాలు!
Stocks to buy today : బడ్జెట్ 2024 నేపథ్యంలో ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని స్వల్ప నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 103 పాయింట్లు పడి 80,502 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 22 పాయింట్లు కోల్పోయి 24,509 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 15 పాయింట్లు పెరిగి 52,280 వద్దకు చేరింది.

స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ షార్ట్ టర్మ్ ట్రెండ్.. పాజిటివ్‌గా ఉంది. 24,600- 24,650 దగ్గర రెసిస్టెన్స్ ఉంది.24,360 లెవల్స్ వద్ద నిఫ్టీకి బలమైన సపోర్ట్ ఉంది.
కానీ బడ్జెట్ సెషన్ కారణంగా స్టాక్ మార్కెట్లలో ఒడుదొడుకులు ఉంటాయని, ట్రేడర్లు- ముఖ్యంగా బిగినర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
నిఫ్టీ 50 బడ్జెట్ ప్రెడిక్షన్..
“నిఫ్టీ డైలీ ఛార్ట్‌లో స్మాల్-బాడీ క్యాండిల్ ఏర్పడింది. ఇది బేరిష్ ఎన్గల్ఫ్ పాటర్న్. తదుపరి మూమెంట్ వచ్చే వరకు వేచి చూడాలని ఇది సూచిస్తోంది. ఆర్ఎస్ఐ సైతం బేరిష్ క్రాసోవర్లోకి ఎంట్రీ ఇచ్చి, ఓవరా బాట్ జోన్ నుంచి ఎగ్జిట్ అవుతోంది. నిఫ్టీ 50 రెసిస్టెనస్ 24,550 వద్ద ఉంది,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ ఎనలిస్ట్ రూపక్ దే తెలిపారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3444.06 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1652.34 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
ఎఫ్ఐఐలు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 25108.69 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. డీఐఐలు రూ. 873.25 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. చాలా నెలల తర్వాత డీఐఐలు సెల్లర్లుగా మారారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 250 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్పంగా లాభపడ్డాయి. డౌ జోన్స్ 0.32శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 1.08శాతం లాభపడింది. నాస్డాక్ 1.58శాతం మేర పెరిగింది.
స్టాక్స్ టు బై..
హెచ్ఏఎల్: రూ.4997 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.5225, స్టాప్ లాస్ రూ.4890
జేడబ్ల్యూఎల్: రూ.642 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.675, స్టాప్ లాస్ రూ.625
జిఎన్ఎఫ్సి: రూ .684 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ .720, స్టాప్ లాస్ రూ .670
స్పోర్ట్కింగ్ ఇండియా: రూ.1161.55 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1222, స్టాప్ లాస్ రూ.1120
ఏడబ్ల్యూహెచ్సీఎల్: రూ.663 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.699, స్టాప్ లాస్ రూ.640
నితిన్ స్పిన్నర్స్: రూ.427 వద్ద కొనండి, టార్గెట్ రూ.444, స్టాప్ లాస్ రూ.410
ఆర్సీఎఫ్: రూ.235 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.248, స్టాప్ లాస్ రూ.227
గ్రావిటా ఇండియా: రూ .1449 వద్ద కొనండి, టార్గెట్ రూ .1520, స్టాప్ లాస్ రూ .1400
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం