Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 739 పాయింట్లు పడి 80,605 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 266 పాయింట్లు కోల్పోయి 24,531 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 355 పాయింట్లు పతనమై 52,266 వద్దకు చేరింది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం బడ్జెట్‌కి ముందు మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. “24,850- 24,900 రేంజ్ వద్ద నిఫ్టీకి బలమైన రెసిస్టెన్స్ కనిపిస్తోంది. 24,200 వద్ద సపోర్ట్ ఉంది. మంగళవారం బడ్జెట్ ఉంది. అప్పటివరకు స్టాక్ స్పెసిఫిక్ ట్రేడింగ్ చేయండి. ఇంట్రాడే సెషన్లోనూ బ్రేకౌట్ స్టాక్స్ ట్రేడ్ చేస్తే బెటర్,” అని ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సుమీత్ బగాడియా తెలిపారు.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1506.12 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 461.56 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
ఎఫ్ఐఐలు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 21664.63 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. డీఐఐలు రూ. 779.09 కోట్లు విలువ చేసే షేర్లను మాత్రమే కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని భారీ నష్టాలతో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 130 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. డౌ జోన్స్ 0.93శాతం పడింది. ఎస్ అండ్ పీ 500 0.71శాతం పడింది. నాస్డాక్ 0.81శాతం మేర పతనమైంది.
ఆర్వీఎన్ఎల్: రూ.613 వద్ద కొనండి, టార్గెట్ రూ.645, స్టాప్ లాస్ రూ.590
నవకర్ కార్ప్: రూ.127.70 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.135, స్టాప్ లాస్ రూ.123
ఎన్ఈసీసీ: రూ.35.50 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.37.35, స్టాప్ లాస్ రూ.34.25
ఎలక్ట్రోస్టీల్ కాస్టింగ్స్: రూ.202.70 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ.212, స్టాప్ లాస్ రూ.195
షైలీ ఇంజనీరింగ్: రూ.844 వద్ద కొనండి, టార్గెట్ రూ.920, స్టాప్ లాస్ రూ.805
కళ్యాణ్ జ్యువెల్లర్స్: రూ.526 వద్ద కొనండి, టార్గెట్ రూ.565, స్టాప్ లాస్ రూ.505
ఇమామీ: రూ.800 వద్ద కొనండి, టార్గెట్ రూ.860, స్టాప్ లాస్ రూ.765
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్: రూ.1595 వద్ద కొనండి, టార్గెట్ రూ.1630, స్టాప్ లాస్ రూ.1560
ఎంఎఫ్ఎస్ఎల్: రూ.1008 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ.1045, స్టాప్ లాస్ రూ.990
అశోక్ లేలాండ్: రూ.224 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.230, స్టాప్ లాస్ రూ.219
సంబంధిత కథనం