Stocks to buy today : ఈ రూ. 145 స్టాక్ కొంటే.. షార్ట్ టర్మ్‌లో మంచి లాభాలు!
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్‌ని భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 540 పాయింట్లు పెరిగి 72,641 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 173 పాయింట్ల లాభంతో 22,012 వద్ద ముగిసింది. ఇక 374 పాయింట్లు పెరిగిన బ్యాంక్ నిప్టీ.. 46,685 వద్దకు చేరింది.
స్టాక్ మార్కెట్ నిపుణులు ప్రకారం.. 22,150- 22,200 దగ్గర నిఫ్టీకి బలమైన రెసిస్టెన్స్ ఉంది. 21,700 దగ్గర సపోర్ట్ ఉందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
Stock market news today : గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1826.97 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3208.87 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ సూచీలు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని స్వల్ప నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ.. దాదాపు 30 పాయింట్ల డౌన్లో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
US Stock market latest news : గురువారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. డౌ జోన్స్ 0.68శాతం, ఎస్ అండ్ పీ 500 0.3శాతం, నాస్డాక్ 0.2శాతం మేర లాభపడ్డాయి.
స్టాక్స్ టు బై..
ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా:- బై రూ. 3707, స్టాప్ లాస్ రూ. 3600, టార్గెట్ రూ. 3920
Intraday Stocks to buy గోడ్రేజ్ కన్జ్యూమర్ ప్రాడక్ట్స్:- బై రూ. 1231.6, స్టాప్ లాస్ రూ. 1185, టార్గెట్ రూ. 1310
బాటా ఇండియా:- బై రూ. 1385, స్టాప్ లాస్ రూ. 1365, టార్గెట్ రూ. 1425
నెల్కో:- బై రూ. 146, స్టాప్ లాస్ రూ. 142, టార్గెట్ రూ. 152
హెచ్‌పీసీఎల్:- బై రూ. 472, స్టాప్ లాస్ రూ. 455, టార్గెట్ రూ. 500
సమ్వర్థన్ మథర్సన్:- బై రూ. 115, స్టాప్ లాస్ రూ. 112, టార్గెట్ రూ. 122
హిమాత్సింఘ్క సైడె:- బై రూ. 123, స్టాప్ లాస్ రూ. 119, టార్గెట్ రూ. 130
ఏబీబీ ఇండియా:- బై రూ. 5860- రూ. 5864, స్టాప్ లాస్ రూ. 5798, టార్గెట్ రూ. 5960
ఎల్టీ ఫుడ్:- బై రూ. 188- రూ. 189, స్టాప్ లాస్ రూ. 183, టార్గెట్ రూ. 200
(గమనిక- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం