Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్- ఈ రూ. 37 స్టాక్‌ని ట్రాక్ చేయండి!
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఇందులో బ్రేకౌట్ స్టాక్స్ సైతం ఉన్నాయి. ఆ వివరాలు..
Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 102 పాయింట్లు పెరిగి 80,905 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 71 పాయింట్లు పెరిగి 24,770 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 118 పాయింట్లు పడి 50,686 వద్దకు చేరింది.
“నిఫ్టీ50 ఇండెక్స్ 24,450 వద్ద కీలకమైన మద్దతు కంటే పైన ఉన్నంత వరకు మొత్తం భారత స్టాక్ మార్కెట్ సానుకూలంగా ఉంటుందని భావించవచ్చు. 50 షేర్ల ఇండెక్స్ సమీపకాలంలో 25,000 మార్కును తాకనుంది. అయితే రేంజ్ బౌండ్ యాక్షన్ ఇంకా కొనసాగుతుంది,” అని ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా అభిప్రాయపడ్డారు. బ్రేకౌట్ స్టాక్స్, స్టాక్ స్పెసిఫిక్ సెటప్‌ని ఫాలో అయితే ట్రేడర్లకు లాభాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 799.74 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3097.45 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఎఫ్ఐఐలు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 33902.07 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. డీఐఐలు రూ. 41212.56 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. గురువారం ట్రేడింగ్ సెషన్‌ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 90 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. డౌ జోన్స్ 0.14శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.42శాతం వృద్ధిచెందింది. నాస్డాక్ 0.57శాతం మేర స్వల్ప వృద్ధిని నమోదు చేసింది.
స్టాక్స్ టు బై..
గుజరాత్ నర్మదా వ్యాలీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ (జీఎన్ఎఫ్సీ): రూ.668 వద్ద కొనండి. టార్గెట్ రూ.697. స్టాప్ లాస్ రూ.654.
గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ లిమిటెడ్ (జీఎస్పీఎల్): రూ.332కు కొనండి. టార్గెట్ రూ .347. స్టాప్ లాస్ రూ.324
సిప్లా లిమిటెడ్: రూ.1,594.60 వద్ద కొనండి. టార్గెట్ రూ.1,660; స్టాప్ లాస్ రూ.1,560
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
నెక్టర్ లైఫ్‌సైన్సెస్: రూ.37.48 వద్ద కొనండి, టార్గెట్ రూ.39.40, స్టాప్ లాస్ రూ.36
లవబుల్ లింగేేరియా: రూ.184.25 వద్ద కొనండి, టార్గెట్ రూ.193, స్టాప్ లాస్ రూ.177.50
హరియోమ్ పైప్ ఇండస్ట్రీస్: రూ.774.50 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.826, స్టాప్ లాస్ రూ.755
దీపక్ ఫెర్టిలైజర్స్: రూ.1052 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ.1100, స్టాప్ లాస్ రూ.1010
వీటో: రూ .180.94 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ .190, స్టాప్ లాస్ రూ .174
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం