Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్! ఈ రూ. 98 స్టాక్‌తో లాభాలకు ఛాన్స్..
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్ స్టాక్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 454 పాయింట్లు పెరిగి 77,073 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 142 పాయింట్లు పెరిగి 23,345 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 810 పాయింట్లు వృద్ధిచెంది 49,350 వద్దకు చేరింది.

“బెంచ్ మార్క్ నిఫ్టీ-50 ఇండెక్స్‌కి 23,170 లెవల్ కీలక సపోర్ట్ జోన్‌గా పనిచేస్తుంది. ఈ స్థాయిని మించి కొనసాగితే తిరిగి 23,450-23,500కు చేరుకోవచ్చు,” అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. ఏదేమైనా, ఇది 23,170 కంటే దిగువకు పడిపోతే, అప్‌ట్రెండ్ బలహీనంగా ఉంటుందని చౌహాన్ స్పష్టం చేశారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 4336.54 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4321.96 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
జనవరి నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు రూ. 50,912.6 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 53,689.1 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 10 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
మార్టిన్ లూథర్ కింగ్ డే కారణంగా సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్లకు సెలవు. కాగా ప్రమాణ స్వీకారం అనంతరం ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, సంతకాలు చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల అనంతరం యూఎస్ స్టాక్ ఫ్యూచర్స్ స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
- స్టోవ్క్రాఫ్ట్- బై రూ. 937.2, స్టాప్ లాస్ రూ. 900, టార్గెట్ రూ. 1000
- టాన్ఫాక్ ఇండస్ట్రీస్- బై రూ. 3,283.55, స్టాప్ లాస్ రూ. 3,170, టార్గెట్ రూ. 3,500
- పీబీ ఫిన్‌టెక్- బై రూ. 1,749, స్టాప్ లాస్ రూ. 1,700, టార్గెట్ రూ. 1,800
- కెనెరా బ్యాంక్- బై రూ. 101, స్టాప్ లాస్ రూ. 98, టార్గెట్ రూ. 107
- ఇండస్ టవర్- బై రూ. 375, స్టాప్ లాస్ రూ. 365, టార్గెట్ రూ. 390
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ (జీఆర్ఎస్ఈ): రూ.1,591.55 వద్ద కొనండి. రూ.1,703 టార్గెట్, స్టాప్ లాస్ రూ.1,535.
శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ (శ్యామ్మెట్ఎల్): రూ.804.60 వద్ద కొనొచ్చు. టార్గెట్ రూ.861. స్టాప్ లాస్ రూ.776.
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్): రూ.1,329.25 వద్ద కొనొచ్చు. టార్గెట్ రూ.1,422, స్టాప్ లాస్ రూ.1,283.
ఇండిజెన్ లిమిటెడ్ (ఐఎన్ డీజీఎన్): రూ.673.75 వద్ద కొనండి. టార్గెట్ రూ.721. స్టాప్ లాస్ రూ.650.
జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ లిమిటెడ్ ( జె & కెబిఐ): రూ .97.96 వద్ద కొనండి; రూ.105 టార్గెట్.. రూ.94 వద్ద స్టాప్ లాస్.
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం