Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 218 పాయింట్లు పెరిగి 81,225 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 104 పాయింట్లు పెరిగి 24,854 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 805 పాయింట్ల లాభంతో 52,094 వద్దకు చేరింది.
నిఫ్టీ50 ఇండెక్స్ నిర్ణయాత్మకంగా 25,000 మార్కును దాటే వరకు శుక్రవారం ర్యాలీ ఉపశమనం కలిగిస్తుందని ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా అభిప్రాయపడ్డారు. భారత స్టాక్ మార్కెట్ ట్రెండ్ ఇంకా ప్రతికూలంగానే ఉందని, ఇటీవలి కనిష్టాలను తిరిగి పరీక్షించవచ్చని ఆయన తెలిపారు. కాబట్టి క్యూ2 ఫలితాలు 2024 సీజన్లో స్టాక్ స్పెసిఫిక్ విధానం మంచిదని సూచించారు. టెక్నికల్ చార్ట్‌లో బలంగా కనిపిస్తున్న స్టాక్స్‌ను పరిశీలించాలని ఆయన సిఫార్సు చేశారు.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 5,485.7 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,214.83 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
అక్టోబర్‌లో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు ఏకంగా రూ. 80217.9 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 74176.2 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని స్వల్ప నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 25 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.09శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.40శాతం పెరిగింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.63శాతం వృద్ధి చెందింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
బాటా ఇండియా: రూ.1,464.95 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1,568, స్టాప్ లాస్ రూ.1,414
టొరెంట్ పవర్: రూ.1,973.65 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.2,112, స్టాప్ లాస్ రూ.1,905
రిలయన్స్ ఇండస్ట్రీస్: రూ.2,720 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.2,800, స్టాప్ లాస్ రూ.2,670
నేషనల్ అల్యూమినియం కంపెనీ: రూ.232 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.250, స్టాప్ లాస్ రూ.224
ఎన్ఎండీసీ లిమిటెడ్: రూ.231 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.242, స్టాప్ లాస్ రూ.224.
సిల్ ఇన్వెస్ట్మెంట్స్: రూ.730 వద్ద కొనండి, టార్గెట్ రూ.785, స్టాప్ లాస్ రూ.705;
ఆగ్రో ఫాస్ (ఇండియా): రూ.48.61 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.52, స్టాప్ లాస్ రూ.47;
రాధికా జ్యువెల్లరీ: రూ.135.75 వద్ద కొనండి, టార్గెట్ రూ.145, స్టాప్ లాస్ రూ.131;
పెన్నార్ ఇండస్ట్రీస్: రూ.207.73 వద్ద కొనుగోలు, లక్ష్యం రూ.222, స్టాప్ లాస్ రూ.199;
విష్ణు ప్రకాశ్ ఆర్ పుంగ్లియా: రూ .312.90 వద్ద కొనండి, టార్గెట్ రూ .333, స్టాప్ లాస్ రూ .302.
సంబంధిత కథనం