Stocks to buy today : భారీగా పతనమైన టాటా మోటార్స్ షేర్లు ఇప్పుడు కొంటే.. భారీ ప్రాఫిట్స్!
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని నష్టాల్లో ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 163 పాయింట్లు కోల్పోయి 73,843 వద్ద ఓపెన్ అయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 97 పాయింట్ల నష్టంతో 22,404 వద్ద ఉంది.
2024 లోక్‌సభ ఎన్నికల 5వ దశ పోలింగ్‌లో భాగంగా ముంబైలో ఓటింగ్ జరగడంతో సోమవారం స్టాక్ మార్కెట్లకు సెలవు లభించింది. ఆదివారం వారాంతపు సెలవు దక్కింది. కాగా.. డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టెమ్ని టెస్ట్ చేసేందుకు.. శనివారం స్టాక్ మార్కెట్ స్పెషల్ సెషన్ జరిగింది. ఇందులో.. సూచీలు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 89 పాయింట్లు పెరిగి 74006 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో 22,502 వద్ద స్థిరపడింది. 84 పాయింట్లు పెరిగిన బ్యాంక్ నిఫ్ట.. 48,200 వద్ద ముగిసింది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. లోక్‌సభ ఎన్నికల అనిశ్చితి కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడుదొడుకులు కనిపిస్తున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడేంతవరకు మదుపర్లు కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిది. నిఫ్టీ50కి 22,400 వద్ద బలమైన సపోర్ట్ ఉంది. అక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంటే.. నిఫ్టీ.. 22,600కి పెరగొచ్చు. కానీ ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకు బిగినర్లు మార్కెట్లకు దూరంగా ఉండటం మంచిది.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
America Stock market today : సోమవారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. డౌ జోన్స్ 0.49శాతం నష్టపోయింది. ఎస్ అండ్ పీ 500 0.09శాతం, నాస్డాక్ 0.65శాతం లాభపడ్డాయి.
స్టాక్స్ టు బై..
Tata Motors share pric target : టాటా మోటార్స్- బై రూ. 954, స్టాప్ లాస్ రూ. 930, టార్గెట్ రూ. 985
ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్- బై రూ. 159, స్టాప్ లాస్ రూ. 152, టార్గెట్ రూ. 172
వేదాంత- బై రూ. 462, స్టాప్ లాస్ రూ. 450, టార్గెట్ రూ. 482
వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్స్- బై రూ. 651.4, స్టాప్ లాస్ రూ. 637, టార్గెట్ రూ. 680
ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్- బై రూ. 696.3, స్టాప్ లాస్ రూ. 682, టార్గెట్ రూ. 730
రాయల్ ఆర్కిడ్ హోటల్స్- బై రూ. 379.6, స్టాప్ లాస్ రూ. 381, టార్గెట్ రూ. 400
Intraday stocks to buy : స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెనెవెబుల్ ఎనర్జీ- బై రూ. 820.6, స్టాప్ లాస్ రూ. 791, టార్గెట్ రూ. 865
టైడ్ వాటర్ ఆయిల్- బై రూ. 1936.2, స్టాప్ లాస్ రూ. 1866, టార్గెట్ రూ. 2050
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం