Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్.. ఈ రూ. 130 స్టాక్‌లో ట్రేడ్ చేస్తే భారీ లాభాలు!
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్‌ని స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 141 పాయింట్లు పెరిగి 77,479 వద్ద స్థిరపడింది. నిఫ్టీ.. 51 పాయింట్ల లాభంతో 23,567 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ.. 385 పాయింట్ల లాభంతో 51,783 వద్ద ఓపెన్ అయ్యింది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ రెసిస్టెన్స్ 23,750 వద్ద ఉంది. అది దాటితే 24,000 వరకు వెళ్లొచ్చు. ఇక నిఫ్టీ సపెర్ట్ 23,350 వద్ద ఉంది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
Stock market news today : గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 415.3 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 325.81 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
ఎఫ్ఐఐలు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 794.53 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించార. డీఐఐలు మాత్రం రూ. 20,209.81 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అందుకే స్టాక్ మార్కెట్లు పెరుగుతున్నాయి.
ఇదీ చూడండి:- ఏప్రిల్-జూన్‌లో హైదరాబాద్‌లో హౌసింగ్ సేల్స్ 20 శాతం డౌన్
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 5 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
US Stock market latest news : గురువారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. డౌ జోన్స్ 0.77శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.25శాతం, నాస్డాక్ 0.79శాతం మేర నష్టపోయాయి.
స్టాక్స్ టు బై..
స్టవ్ క్రాఫ్ట్:- బై రూ. 574.3, స్టాప్ లాస్ రూ. 550, టార్గెట్ రూ. 610
తిరుమలై కెమికల్స్:- బై రూ. 326.8, స్టాప్ లాస్ రూ. 315, టార్గెట్ రూ. 345
Stock to buy : బిర్లా కార్పొరేషన్ లిమిటెడ్:- బై రూ. 1575, స్టాప్ లాస్ రూ. 1520, టార్గెట్ రూ. 1650
పంజాబ్ నేషనల్ బ్యాంక్:- బై రూ. 129, స్టాప్ లాస్ రూ. 124, టార్గెట్ రూ. 135
రామ్‌కో సిమెంట్స్:- బై రూ. 867, స్టాప్ లాస్ రూ. 890, టార్గెట్ రూ. 850
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం