Stocks to buy today : ఈ రూ. 185 స్టాక్​ కొంటే.. షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు!-stocks to buy today 20th november 2023 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ఈ రూ. 185 స్టాక్​ కొంటే.. షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు!

Stocks to buy today : ఈ రూ. 185 స్టాక్​ కొంటే.. షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు!

Sharath Chitturi HT Telugu
Published Nov 20, 2023 09:14 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

స్టాక్స్​ టు బై టుడే..
స్టాక్స్​ టు బై టుడే..

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా మొదలుపెట్టాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 7 పాయింట్ల నష్టంతో 65,787 వద్ద ఓపెన్​ అయ్యింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 33 పాయింట్లు కోల్పోయి 19,732 వద్ద ప్రారంభమైంది.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ షార్ట్​ టర్మ్​ ట్రెండ్​ పాజిటివ్​గానే ఉంది.

"నిఫ్టీ షార్ట్​ టర్మ్​ ట్రెండ్​ పాజిటివ్​గానే ఉన్నప్పటికీ.. 1-2 ట్రేడింగ్​ సెషన్స్​ వరకు కన్సాలిడేషన్​ లేకా మైనర్​ వీక్​నెస్​ని చూడవచ్చు. 19,875 లెవల్స్​ దాటితేనే అప్​ట్రెండ్​ కొనసాగుతుంది. 19,600- 19,550 లెవల్స్​ సపోర్ట్​గా ఉన్నాయి," అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 477.76 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 565.48 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇండియా స్టాక్​ మార్కెట్​లో ఈ నవంబర్​లో ఇప్పటివరకు రూ. 6,574.59 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు ఎఫ్​ఐఐలు.

లాభాలు.. నష్టాలు..

టైటాన్​, ఎం అండ్​ ఎం, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, సన్​ఫార్మా, టాటా మోటార్స్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

యాక్సిస్​ బ్యాంక్​, విప్రో, బజాజ్​ ఫైనాన్స్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

Stock market news today : శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా సూచీలు ఫ్లాట్​గా ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెకస్​ 0.01శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500 0.13శాతం, నాస్​డాక్​ 0.08శాతం వృద్ధిచెందాయి.

స్టాక్స్​ టు బై టుడే..

ఔరబిందో ఫార్మా:- బై రూ. 1004.40, స్టాప్​ లాస్​ రూ. 975, టార్గెట్​ రూ. 1064.

LT share price target : ఎల్​ అండ్​ టీ:- బై రూ. 3109, స్టాప్​ లాస్​ రూ. 3025, టార్గెట్​ రూ. 3230

ఎస్కార్ట్స్​:- బై రూ. 3230, స్టాప్​ లాస్​ రూ. 3170, టార్గెట్​ రూ. 3330

Stocks to buy : దేవయాని ఇంటర్నేషనల్​:- బై రూ. 186, స్టాప్​ లాస్​ రూ. 182, టార్గెట్​ రూ. 193

మ్యాన్​కైండ్​ ఫార్మా:- బై రూ. 1915- రూ. 1920, స్టాప్​ లాస్​ రూ. 1860, టార్గెట్​ రూ. 2050

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం