సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 271 పాయింట్లు పడి 82,059 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 74 పాయింట్లు కోల్పోయి 24,945 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 66 పాయింట్లు పెరిగి 55,421 వద్దకు చేరింది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 525.95 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 237.93 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 85 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ-50 ఇండెక్స్ 25,000 స్థాయిని తిరిగి చేరుకోకపోతే ఒత్తిడిలో ఉండవచ్చు. నిఫ్టీ 24,800-24,750 జోన్ వైపు పయనించవచ్చు. 24,750 దిగువకు పడిపోతే మరింత లోతైన దిద్దుబాటుకు అవకాశం ఉంది. దీనికి విరుద్ధంగా, 25,000 కంటే ఎక్కువ కదలిక 25,250–25,350 శ్రేణి వైపు ర్యాలీని ప్రేరేపిస్తుంది,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ ఎనలిస్ట్ రూపక్ డే చెప్పారు.
సోమవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. డౌ జోన్స్ 0.32 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.08శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.02 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో స్వల్ప లాభల్లో కొనసాగుతున్నాయి.
బీఏఎస్ఎఫ్ ఇండియా: రూ.4902.90 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.5450, స్టాప్ లాస్ రూ.4665;
వీల్స్ ఇండియా: రూ.772.65 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.850, స్టాప్ లాస్ రూ.735;
ఆర్తి డ్రగ్స్: రూ.480.60 వద్ద కొనండి, టార్గెట్ రూ.530, స్టాప్ లాస్ రూ.455;
ఐనాక్స్ విండ్: రూ.185.61 వద్ద కొనండి, టార్గెట్ రూ.205, స్టాప్ లాస్ రూ.176;
కేపీఐ గ్రీన్ ఎనర్జీ: రూ.485.70 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.540, స్టాప్ లాస్ రూ.460.
సంబంధిత కథనం