ఇజ్రాయెల్- ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో గురువారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 83 పాయింట్లు పడి 81,362 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 19 పాయింట్లు పతనమై 24,793 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 251 పాయింట్లు పడి 55,577 వద్దకు చేరింది.
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 365.68 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,008.43 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 10 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“మార్కెట్లో నెగిటివ్ సెంటిమెంట్ కనిపిస్తోంది. నిఫ్టీ50 24,850 దిగువన కొనసాగినంత కాలం ఇదే కొనసాగవచ్చు. 24,550 వద్ద సపోర్ట్ కనిపిస్తోంది,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ ఎనలిస్ట్ రూపక్ దే తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లకు గురువారం సెలవు. కాగా, యూఎస్ స్టాక్ ఫ్యూచర్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.
విప్రో- బై రూ. 265.6, స్టాప్ లాస్ రూ. 256, టార్గెట్ రూ. 285
ఐషేర్ మోటార్స్- బై రూ. 5493.5, స్టాప్ లాస్ రూ. 5300, టార్గెట్ రూ. 5880
యాక్సిస్ బ్యాంక్- బై రూ. 1218, స్టాప్ లాస్ రూ. 1190, టార్గెట్ రూ. 1250
ఫెడరల్ బ్యాంక్- బై రూ. 203, స్టాప్ లాస్ రూ. 197, టార్గెట్ రూ. 215
టాటా కెమికల్స్ లిమిటెడ్- బై రూ. 910, స్టాప్ లాస్ రూ. 890, టార్గెట్ రూ. 945
స్విగ్గీ: రూ.374.15 వద్ద కొనండి, టార్గెట్ రూ.401, స్టాప్ లాస్ రూ.361;
అబాన్ ఆఫ్షోర్ లిమిటెడ్ ఫుల్లీ పెయిడ్ ఓఆర్డీ: రూ.59.29 వద్ద కొనండి, టార్గెట్ రూ.64, స్టాప్ లాస్ రూ.57.21;
జీఆర్ఎం ఓవర్సీస్: రూ.372.25 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.400, స్టాప్ లాస్ రూ.359;
గాలంట్ ఇస్పాత్: రూ.470.60 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ.504, స్టాప్ లాస్ రూ.454;
సుమిటోమో కెమికల్ ఇండియా: రూ.502.25 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.537, స్టాప్ లాస్ రూ.484.
సంబంధిత కథనం