Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​! ఈ 5 బ్రేకౌట్​ స్టాక్స్​ని ట్రాక్​ చేయండి..-stocks to buy today 20th jan 2025 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ అలర్ట్​! ఈ 5 బ్రేకౌట్​ స్టాక్స్​ని ట్రాక్​ చేయండి..

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​! ఈ 5 బ్రేకౌట్​ స్టాక్స్​ని ట్రాక్​ చేయండి..

Sharath Chitturi HT Telugu
Jan 20, 2025 08:10 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్​ స్టాక్స్​ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

స్టాక్స్​ టు బై టుడే..
స్టాక్స్​ టు బై టుడే..

దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 423 పాయింట్లు పడి 76,619 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 109 పాయింట్లు పడి 23,203 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 738 పాయింట్లు పడి 48,540 వద్దకు చేరింది.

yearly horoscope entry point

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 3318.06 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2572.88 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

జనవరి​​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు రూ. 46,576.06 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 49,367.14 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 15 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.78శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 1 శాతం పెరిగింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 1.5శాతం వృద్ధిచెందింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో లాభాల్లో కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

సెయిల్​- బై రూ. 108.82, స్టాప్​ లాస్​ రూ. 105, టార్గెట్​ రూ. 117

ఎస్​జేవీఎన్​- బై రూ. 100.76, స్టాప్​ లాస్​ రూ. 97, టార్గెట్​ రూ. 108

జుబీలియెంట్​ ఫుడ్​వర్క్​- బై రూ. 693, స్టాప్​ లాస్​ రూ. 720

గోడ్రేజ్​ ప్రాపర్టీస్​- బై రూ. 2410, స్టాప్​ లాస్​ రూ. 2370, టార్గెట్​ రూ. 2470

పిడిలైట్​ ఇండస్ట్రీస్​- బై రూ.2815, స్టాప్​ లాస్​ రూ. 2760, టార్గెట్​ రూ. 2870

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

ఐఆర్​బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్: రూ.54.89 వద్ద కొనండి, టార్గెట్ రూ.59, స్టాప్​లాస్ రూ.53;

మెజగావ్ డాక్​షిప్ బిల్డర్స్: రూ.2315.05 వద్ద కొనండి, టార్గెట్ రూ.2477, స్టాప్ లాస్ రూ.2234;

డేటా ప్యాటర్న్స్ ఇండియా: రూ.2281.05 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.2441, స్టాప్ లాస్ రూ.2201;

మోనార్క్ నెట్వర్త్ క్యాపిటల్: రూ.445.60 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.477, స్టాప్ లాస్ రూ.430;

శివాలిక్ రసయన్: రూ .775.15 వద్ద కొనండి, టార్గెట్ రూ .829, స్టాప్ లాస్ రూ .748.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం