Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​! మార్కెట్​లు పడుతున్నా- ఈ బ్రేకౌట్​ స్టాక్స్​తో లాభాలు..!-stocks to buy today 19th november 2024 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ అలర్ట్​! మార్కెట్​లు పడుతున్నా- ఈ బ్రేకౌట్​ స్టాక్స్​తో లాభాలు..!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​! మార్కెట్​లు పడుతున్నా- ఈ బ్రేకౌట్​ స్టాక్స్​తో లాభాలు..!

Sharath Chitturi HT Telugu
Nov 19, 2024 08:10 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్​ స్టాక్స్​ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

స్టాక్స్​ టు బై..
స్టాక్స్​ టు బై..

దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 241 పాయింట్లు పడి 77,339 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 79 పాయింట్లు కోల్పోయి 23,456 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ మాత్రం 184 పాయింట్లు పెరిగి 50,364 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ షార్ట్​ టర్మ్​ ట్రెండ్​.. నెగిటివ్​గా ఉంది. పైగా నిఫ్టీ50 200 డీఎంఏని బ్రేక్​ చేసి కిందకు వెళ్లింది. ఫలితంగా రానున్న కాలంలో నిఫ్టీ50 23,300-23,600 మధ్య కదలాడొచ్చు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1403.3 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2330.56 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

నవంబర్​ నెల​లో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు రూ. 30,936.57 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 28,852.88 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 30 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.13శాతం పడింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.39శాతం పెరిగింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.60శాతం వృద్ధిచెందింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో లాభాల్లో కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

ఏజిస్​ లాజిస్టిక్స్​- బై రూ.842.9, స్టాప్​ లాస్​ రూ. 810, టార్గెట్​ రూ. 899

సైర్మా ఎస్​జీఎస్​ టెక్నాలజీ- బై రూ. 560.1, స్టాప్​ లాస్​ రూ. 540, టార్గెట్​ రూ. 590

ఎస్​బీఐ- బై రూ. 815, స్టాప్​ లాస్​ రూ. 800, టార్గెట్​ రూ. 835

జిందాల్​స్టీల్​- బై రూ. 887, స్టాప్​ లాస్​ రూ. 870, టార్గెట్​ రూ. 910

రామకృష్ణ ఫోర్జింగ్​- బై రూ. 940, స్టాప్​ లాస్​ రూ. 920, టార్గెట్​ రూ. 970

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

బ్లూజెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ (బ్లూజెట్): రూ.546కే కొనండి. రూ.580 టార్గెట్.. రూ.520 వద్ద స్టాప్ లాస్.

సిప్లా లిమిటెడ్ (సిప్లా): రూ.1,470కు విక్రయం. లక్ష్యం రూ.1,430 స్టాప్ లాస్ రూ.1,490 వద్ద ఉంది.

ఐడీఎఫ్​సీ ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్ (ఐడీఎఫ్సీబీ): రూ.65కే కొనండి. లక్ష్యం రూ.68. స్టాప్ లాస్ రూ.63.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం