ట్రేడర్స్​ అలర్ట్​- టీవీఎస్​ మోటార్​ షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఇదే..-stocks to buy today 19th may 2025 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ట్రేడర్స్​ అలర్ట్​- టీవీఎస్​ మోటార్​ షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఇదే..

ట్రేడర్స్​ అలర్ట్​- టీవీఎస్​ మోటార్​ షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఇదే..

Sharath Chitturi HT Telugu

ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్​ స్టాక్స్​ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 200 పాయింట్లు పడి 82,331 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 42 పాయింట్లు కోల్పోయి 25,020 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 1 పాయింట్​ పెరిగి 55,355 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 8831.05 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,187.09 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

మే​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు రూ. 23782.64 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 23,298.54 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 15 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50కి 24,665- 24,400 లెవల్స్​ సపోర్ట్​గా ఉన్నాయి. 25,100 లెవల్ రెసిస్టెన్స్​గా ఉంది. ఇది బ్రేక్​ అయితే సూచీ 25,500 వరకు వెళ్లొచ్చు. 24,400 దిగువకు పడితే మాత్రం ఇంకా దిగువకు వెళ్లిపోవచ్చు,” అని కొటాక్​ సెక్యూరిటీస్​ వైస్​ ప్రెసిడెంట్​ టెక్నికల్​ రీసెర్చ్​ అమోల్​ అథవాలే తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.78 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.70శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.52 శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

మెడ్​ప్లస్​ హెల్త్​ సర్వీసెస్​- బై రూ. 885, స్టాప్​ లాస్​ రూ. 855, టార్గెట్​ రూ. 950

డేటా పాటర్న్స్​- బై రూ. 2868, స్టాప్​ లాస్​ రూ. 2765, టార్గెట్​ రూ. 3060

ఐడియాఫోర్జ్​ టెక్నాలజీ- బై రూ. 560, స్టాప్​ లాస్​ రూ. 545, టార్గెట్​ రూ. 600

హౌజింగ్​ అండ్​ అర్బన్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​- బై రూ. 233.8, స్టాప్​ లాస్​ రూ. 228, టార్గెట్​ రూ. 247

టీవీఎస్​ మోటార్​ కంపెనీ- బై రూ. 2841, స్టాప్​ లాస్​ రూ. 2790, టార్గెట్​ రూ. 2960

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

దేవయాని ఇంటర్నేషనల్: రూ.186.89 వద్ద కొనండి, టార్గెట్ రూ.200, స్టాప్ లాస్ రూ.180;

గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్: రూ.354.60 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.380, స్టాప్ లాస్ రూ.342;

డ్రీమ్ఫోక్స్ సర్వీసెస్: రూ.282.55 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.302, స్టాప్ లాస్ రూ.272;

ఇర్కాన్ ఇంటర్నేషనల్: రూ.188.88 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.203, స్టాప్ లాస్ రూ.182.26;

యూసీఏఎల్: రూ.166.58 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.175, స్టాప్ లాస్ రూ.160.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం