Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్‌ని లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 627 పాయింట్లు పెరిగి 81,343 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 188 పాయింట్లు పెరిగి 24,800 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 224 పాయింట్లు పెరిగి 52,620 వద్దకు చేరింది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ షార్ట్ టర్మ్ ట్రెండ్.. పాజిటివ్‌గా ఉంది. 24,000- 24,100 దగ్గర స్టెబులిటీ ఉంటే.. నిఫ్టీ 24,380- 24,400 వరకు వెళ్లొచ్చు. 23,800 లెవల్స్ వద్ద నిఫ్టీకి బలమైన సపోర్ట్ ఉంది.
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 5483.63 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2904.25 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
ఎఫ్ఐఐలు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 20158.51 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. డీఐఐలు రూ. 1240.65 కోట్లు విలువ చేసే షేర్లను మాత్రమే కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 30 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
గురువారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. డౌ జోన్స్ 1.29శాతం పడింది. ఎస్ అండ్ పీ 500 0.78శాతం పడింది. నాస్డాక్ 0.7శాతం మేర పతనమైంది.
ఇన్పోసిస్ షేర్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. భారత్‌లో రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ జూన్ 30, 2024తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను ప్రకటించడం ఇందుకు కారణం. జూన్ 30, 2024తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ ఏకీకృత పన్ను అనంతర లాభం రూ .6,368 కోట్లుగా నివేదించింది, ఇది గత ఏడాది ఇదే కాలంలో రూ .5,945 కోట్లతో పోలిస్తే 7.1% పెరుగుదలను ప్రతిబింబిస్తుంది. గత త్రైమాసికంలో పన్ను రీఫండ్ ప్రోత్సాహం కారణంగా ఇన్ఫోసిస్ బాటమ్ లైన్ త్రైమాసిక ప్రాతిపదికన 20.1 శాతం పడిపోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉమాంగ్ డెయిరీస్: రూ.160.45 వద్ద కొనండి, టార్గెట్ రూ.168, స్టాప్ లాస్ రూ.154
ఆల్ఫాజియో ఇండియా: రూ.511.50 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.540, స్టాప్ లాస్ రూ.495
క్విక్ హీల్: రూ.608.20 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ.650, స్టాప్ లాస్ రూ.495
ఆదిత్య బిర్లా మనీ: రూ.183.30 వద్ద కొనండి, టార్గెట్ రూ.194, స్టాప్ లాస్ రూ.178
డీసీఎం: రూ .99.90 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ .105, స్టాప్ నష్టం రూ .96
సంబంధిత కథనం