Stocks to buy today : స్టాక్స్ టు బై.. విప్రో షేర్ ప్రైజ్ టార్గెట్ ఇదే!
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై వివరాలను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ను లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 320 పాయింట్లు పెరిగి 67,839 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 89 పాయింట్లు వృద్ధి చెంది 20,192 వద్ద ముగిసింది. ఇక 231 పాయింట్లు పెరిగిన బ్యాంక్ నిఫ్టీ.. 46,231 వద్దకు చేరింది.
ట్రెండింగ్ వార్తలు
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 164.42 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు ఏకంగా రూ. 1938.57 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
Stock market news today : ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ను దేశీయ సూచీలు నష్టాల్లో మొదలుపెట్టే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 60 పాయింట్ల నష్టంలో ఉండటమే ఇందుకు కారణం.
ఇక ఉత్తర భారతంలో వినాయక చవితి నేపథ్యంలో మంగళవారం స్టాక్ మార్కెట్లకు సెలవు ఉండనుంది. ఈ విషయాన్ని ట్రేడర్లు గమనించగలరు.
ఇదీ చూడండి:- EMS IPO allotment: ఈఎంఎస్ ఐపీఓ అలాట్మెంట్ పూర్తయింది.. జీఎంపీ ఎంతో తెలుసా? అమ్మేయడం బెటరా? లాంగ్ టర్మ్ కు హోల్డ్ చేయాలా?
అమెరికా స్టాక్ మార్కెట్లు..
అమెరికా సూచీలు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో భారీగా నష్టపోయాయి. ఎస్ అండ్ పీ 500 1.2శాతం, నాస్డాక్ 1.56శాతం, డౌ జోన్స్ 0.83శాతం మేర నష్టపోయాయి.
స్టాక్స్ టు బై..
Wipro share price target : విప్రో:- బై రూ. 441.05, స్టాప్ లాస్ రూ. 429, టార్గెట్ రూ. 460
యూపీఎల్:- బై రూ. 634.65, స్టాప్ లాస్ రూ. 616, టార్గెట్ రూ. 672
IPCA lab share price target : ఐప్కా ల్యాబ్:- బై రూ. 927- రూ. 932, స్టాప్ లాస్ రూ. 847, టార్గెట్ రూ. 1090
మహారాష్ట్ర స్కూటర్స్:- బై రూ. 7550- 7560, స్టాప్ లాస్ రూ. 7370, టార్గెట రూ. 7910
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం